నిమ్మనపల్లి : విద్యార్థుల జిఇఆర్ పక్కాగా ఉండాలని, వంద శాతం పూర్తి చేయాలని మదనపల్లి డిఎల్‌డిఒ లక్ష్మీపతి అన్నారు. గురువారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో ఎంపిడిఒ శేషగిరిరావు, ఎంఇఒ పద్మావతి లతో కలిసి పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సంక్షేమ విద్యా సహాయ కులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మండలంలో విద్యార్థుల గ్రాస్ ఎన్రోల్మెంట్ రిజిస్ట్రేషన్ జరుగుతున్న తీరుపై ఆరా తీశారు. సచివాలయ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్లు, వాలంటీర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి డ్రాప్‌అవుట్స్ విద్యార్థులను గుర్తించి వారిని తిరిగి బడిలో చేర్పించాలని అన్నారు. విద్యార్థుల గ్రాస్ ఎన్రోల్మెంట్ వంద శాతం వెంటనే పూర్తి చేయాలన్నారు. తరగతుల వారీగా ఎన్రోల్మెంట్ పై ఎంఇఒలు, పంచాయతీ కార్యదర్శులు, ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని విద్యార్థులను గుర్తించాలన్నారు. అంగన్వాడీ నుంచి ఒకటవ తరగతిలోకి, 6,7,8,9,10 తరగతిలోకి పూర్తిగా చేరేలా చర్యలు చేపట్టాలన్నారు. పదవ తరగతి ఫెయిల్ లైన విద్యార్థులను తిరిగి పదిలో చేర్పించాలని సూచించారు. బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అమ్మ ఒడి, జగనన్న గోరుముద్దలో భాగంగా మధ్యాహ్నం భోజనం, జగనన్న విద్యా కానుక వంటి రాయితీలను అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు విద్యార్థి దశలో చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగేలా వాళ్లని తల్లిదం డ్రులతోపాటు, ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని సూచించారు. ప్రణాళిక బద్ధంగా జిఇఆర్‌ను వంద శాతం పూర్తి చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే తగిన చర్యలు తీసు కోబడ తాయని తెలిపారు. కార్యక్రమంలో ఎంపిడిఒ శేషగిరిరావు, ఎంఇఒ పద్మావతి, పంచాయతీ కార్యదర్శులు, ఎడ్యుకేషన్‌వెల్ఫేర్ అసిస్టెంట్లు పాల్గొ న్నారు. అనంతరం 1,2 గ్రామ సచివాలయాలను ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు. ఎంపిడిఒ శేషగిరిరావు సచివాలయ కార్యాలయాల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలను డిఎల్‌డిఒకు వివరించారు. ఉద్యోగుల హాజరు పట్టికను, పలురికార్డులను, మూమెంట్ రిజిస్టర్‌లను, ప్రభుత్వ పథకాలఅర్హుల, అనర్హుల జాబితాలను పరిశీలించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజేష్, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.సచివాలయ సిబ్బందికి సూచనలిస్తున్న డిఎల్‌డిఒ లక్ష్మీపతి










