ప్రెపెస్టా, ఎడూమూన్ సంస్థలతో ఎంఒయు
వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ దయానంద సిద్దవట్టం
ప్రజాశక్తి- మధురవాడ : ఇంజనీరింగ్, ఫార్మశీ, మేనేజ్‌మెంట్ తదితర వృత్తి విద్యా కోర్సులు అభ్యసించే విద్యార్ధులలో నైపుణ్యాలను పెంచడానికి గీతం విశ్వవిద్యాలయం అన్ని చర్యలు తీసుకుంటోందని వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ దయానంద సిద్దవట్టం అన్నారు. బుధవారం గీతం కెరీర్ గైడెన్స్ సెంటర్ ఆధ్వర్యంలో విద్యార్ధులకు వివిధ శిక్షణ, ఆన్‌లైన్ కోర్సులు, సదస్సులు నిర్వహించడానికి ప్రెపెన్‌స్టా, ఎడూమూన్ సంస్థలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా విసి మాట్లాడుతూ, పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థుల నైపుణ్యాలను పెంచుకోవడానికి ఈ ఒప్పందాలు దోహదపడతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రెపెన్‌స్టా సంస్థ వ్యవస్థాపకుడు అతుల్య కౌశిక్, డైరక్టర్ మనీస్ అగర్వాల్‌లతో పాటు ఎడూమూన్ చీఫ్ డవలప్‌మెంట్ ఆఫీసర్ బ్రిజేష్ బాబు, గీతం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డి.గుణశేఖరన్ పాల్గొన్నారు. ఈ అవగాహన ఒప్పందాల ద్వారా గీతం విద్యార్ధులకు 20కి పైగా సర్టిఫికేట్ కోర్సులు, ప్రాంగణ నియామకాలకు ఉపయోగపడే స్టడీమెటీరియల్, నూతన నైపుణ్యాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని గీతం కెరీర్ గైడెన్స్ సెంటర్ అధికారులు వెల్లడించారు.
ఒప్పంద పత్రాలను మార్చుకుంటున్న సంస్థల ప్రతినిధులు










