ప్రజాశక్తి - ఆరిలోవ : విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నిత్యం తపన పడుతుంటారని, దీన్ని దృష్టిలో పెట్టుకొని విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని అన్నారు. ఆరిలోవ తోటగరువు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విడదల రజని ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచీ విద్యావ్యవస్థను మెరుగుపరిచేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. నూతన సాంకేతికతను ఉపయోగించుకొని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.
జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున, మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, విఎంఆర్‌డిఎ చైర్మన్ అక్కరమాని విజయనిర్మల, జిల్లా పరిషత్ చైర్మన్ సభద్ర, డిఇఒ ఎల్.చంద్రకళ మాట్లాడుతూ, ఈ ట్యాబ్‌లను సద్వినియోగంచేసుకొని విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ పాల్‌కిరణ్, కార్పొరేటర్లు కోరుకొండ స్వాతిదాస్, అక్కరమాని రోహిణి, కెల్ల సునీత, ఎడ్యుకేషన్ డైరెక్టర్ పతివాడ వెంకటలక్ష్మి, వైసిపి నాయకులు జగ్గుపిల్ల అప్పలరాజు, కెల్ల సత్యనారాయణ, సత్తి మందారెడ్డి, కన్నేటి సుబ్బారెడ్డి, మాజీ మార్కెటింగ్ చైర్మన్ అల్లంపల్లి రాజబాబు తదితరులు పాల్గొన్నారు.
ట్యాబ్‌ల పంపిణీ
ప్రజాశక్తి-సీతమ్మధార : 25వ వార్డు పరిధి మధురానగర్ జీవీఎంసీ హైస్కూల్ 8వ తరగతి విద్యార్థులకు కార్పొరేటర్ సారిపిల్లి గోవింద్‌తో కలిసి నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త కెకె.రాజు 97 ట్యాబ్‌లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కెకె.రాజు మాట్లాడుతూ, చదుకోవాలని తపన పడే ప్రతి విద్యార్థికీ ఉన్నత విద్య వరకు ప్రభుత్వమే చేయుతనిచ్చేలా ముఖ్యమంత్రి కృషిచేస్తున్నారన్నారు. కులమతాలకు, పార్టీలకతీతంగా అర్హతే ప్రామాణికంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి అభివృద్ధే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు శాంతికుమారి, ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు దేముడుబాబు, బోగవల్లి గోవింద్, సారిపిల్లి సంతోష్, సమ్మెట్ల వెంకటేష్, స్కూల్ సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.










