Jul 05,2023 00:23

విద్యార్థినులతో మాట్లాడుతున్న ఐటిడిఎ పిఒ సూరజ్‌ గనోరే

- ఐటీడీఏ పీవో సూరజ్‌ గనోరే ఆదేశం
ప్రజాశక్తి-మారేడుమిల్లి

ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం పట్ల సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో సూరజ్‌ గనోరే అన్నారు. స్థానిక బాలికల ఆశ్రమ పాఠశాలను మంగళవారం ఆయన సందర్శించారు. పాఠశాలలో స్టోర్‌ రూమ్‌, విద్యార్థుల తరగతి, హస్టల్‌ గదులు, వంటశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేస్తు సహించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలు ప్రకారం రోజు మోను సక్రమంగా అమలు చేయాలని, నిత్యావసర వస్తువులు, కురగాయాలు ఎప్పటికప్పుడు తాజగా ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. వేడి, వేడి పదార్థాలు విద్యార్థులకు పెట్టాలని సూచించారు. విద్యార్థుల విద్యాబోధనలను పరిశీలించారు. జగనన్న విద్యా దీవెన కీట్లు ప్రతి విద్యార్థికీ అందాయా? లేదా? అని ఆరా తీశారు. పాఠశాల పరిసరాలు నిత్యం పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.