
ప్రజాశక్తి - నరసాపురం
భీమవరానికి చెందిన ఒమిక్స్ నెక్స్ట్‌జెన్ లెబొరేటరీస్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థతో వైఎన్.కళాశాల సంయుక్త ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ద్వారా ఒమిక్స్ నెక్స్ట్‌జెన్ లెబొరేటరీస్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ వారు కళాశాల విద్యార్థులకు స్టూడెంట్స్ ప్రాజెక్ట్స్‌పై శిక్షణ ఇస్తారని, ఎంప్లారుబిలిటి స్కిల్స్ పెంపొందించేలా అవగాహన కల్పిస్తారని, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కల్పిస్తారని, వర్కషాపులు నిర్వహిస్తారని, స్టూడెంట్స్‌కి స్టార్ట్‌అప్స్‌పై అవగాహన కార్యక్రమాలు చేపడతారని ఒమిక్స్ నెక్ట్స్‌జెన్ లెబొరేటరీస్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కె.మురళీకృష్ణ అన్నారు. ఈ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ పి.మధుబాబు మాట్లాడుతూ నర్సింగ్ కోర్సులు, ఫార్మా కోర్సులు, మెడికల్, హెల్త్ టెక్నాలజీల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా, హెల్త్ కేర్, మెడికల్ చెక్‌అప్ టెస్టింగ్‌లకు ఉన్న డిమాండ్‌పై అవగాహన కల్పిస్తారని, సర్టిఫికేట్ కోర్సులు నిర్వహిస్తారని చెప్పారు. కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ డాక్టర్ చినమిల్లి సత్యనారాయణరావు మాట్లాడుతూ ఈ సంయుక్త ఒప్పందం ద్వారా విద్యార్థులకు ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉపాధి పొందేందుకు కావాల్సిన నైపుణ్యాలను పెంపొందించుకునే విధంగా శిక్షణ అవకాశాలను కల్పించనున్నట్లు తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎపివి.అప్పారావు, డీన్ డాక్టర్ గంధం శ్రీరామకృష్ణ, వైస్ ప్రిన్సిపల్స్ చింతపల్లి కనకారావు, బెజవాడ వెంకటరత్నం, డాక్టర్ ఎల్.రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.