ప్రజాశక్తి-చీడికాడ:విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లను అందజేయడం జరిగిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలయుడు తెలిపారు. మండలంలోని మంచాల గ్రామంలో విద్యార్థులకు ట్యాబ్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు సాంకేతికంగా అభివృద్ధి చెంది భవిష్యత్తులో మంచిగా స్థిరపడి కుటుంబాలను ఉన్నత స్థాయిలో నిలబెట్టాలన్నారు.ఈ సదుద్దేశంతోనే జగన్మోహన్‌రెడ్డి విద్యార్థులకు వీటిని అందిస్తున్నారన్నారు.మండలంలో 532 మందికి ట్యాబ్‌లన అందజేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొరచా జయమ్మ నారాయణమూర్తి, జడ్పిటిసి శారద వరలక్ష్మి జానకిరామ్, తహసీల్దార్ బీవి రాణి, ఓఎస్‌డి పోలి నాయుడు, పార్టీ కన్వీనర్ రాజబాబు, యూత్ అధ్యక్షుడు స్వామి నాయుడు పాల్గొన్నారు
కోటవురట్ల:రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తుందని జెడ్పిటిసి ఉమాదేవి తెలిపారు. మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాల వద్ద ఎంఈఓ అప్పారావు ఆధ్వర్యంలో విద్యార్థులకు ట్యాబ్‌లను శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పాఠశాలలో అన్ని వసతులు అదేవిధంగా సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. వైస్ ఎంపీపీ దత్తుడు రాజు మాట్లాడుతూ, విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మండల విద్యాశాఖ అధికారి పి.అప్పారావు మాట్లాడుతూ, మండలానికి 180 ట్యాబులు వచ్చాయని, ప్రభుత్వ పాఠశాలకు 81, గర్ల్స్ హైస్కూల్ కు 63, కేజీబీవీకి 24 ట్యాబులు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి సీనియర్ నాయకులు సత్తిబాబు, స్థానిక ఎంపీటీసీ సభ్యులు రాంబాబు, ప్రధానోపాధ్యాయురాలు ప్రమీల, విద్యా కమిటీ అధ్యక్షులు నిమ్మల గొల్లబాబు పాల్గొన్నారు.
నర్సీపట్నం టౌన్: పెద్ద బొడ్డేపల్లి ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలలో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ట్యాబ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సాల్మన్ రాజు, మున్సిపాలిటీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
నక్కపల్లి:స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే గొల్ల బాబురావు ట్యాబ్ లు పంపిణీని ప్రారంభించారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యా రంగానికి పెద్దపీట వేస్తూ సమూలమైన మార్పులు తీసుకువచ్చారని అన్నారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ డివిడి ప్రసాద్, హెచ్‌ఎం రాణి లలిత, ఎంపీపీ రత్నం, సర్పంచ్ జయ రత్న కుమారి, జెడ్‌పిటిసి కాసులమ్మ, మండల పరిషత్ ఉపాధ్యక్షులు ఈశ్వరరావు, స్కూల్ కమిటీ చైర్మన్ పద్మ, పిడి రాజు, వైసిపి నాయకులు శీరం నరసింహామూర్తి, శేషరత్నం, యలమంచిలి తాతబాబు, చందరావు పాల్గొన్నారు.
బుచ్చయ్యపేట : మండలంలోని సీతయ్యపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మండలంలోని 8వ తరగతి విద్యార్థులకు చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ చేతుల మీదుగా ట్యాబ్‌లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు బైజూస్ ద్వారా విద్యాబాధనకు ఉపకరించే విధంగా ట్యాబులను పంపిణీ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దాకారపు నాగేశ్వరి దేవి, జడ్పిటిసి దొండ రాంబాబు, తహశీల్దార్ అంబేద్కర్, ఎంపీడీవో సువర్ణరాజు, వైసిపి మండల అధ్యక్షులు కొల్లిమల్ల అచ్చం నాయుడు, పలువులు ప్రజాప్రతినిధులు, హెచ్‌ఎంలు, విద్యార్థులు పాల్గొన్నారు.
అచ్యుతాపురం : అచ్యుతాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు శుక్రవారం ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు చేతుల మీదుగా ట్యాబ్‌లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు తయారు చేసిన పలు విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలను ఎమ్మెల్యే తిలకించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి మాజీ చైర్మన్ యు సుకుమార్ వర్మ, వైసిపి మండల అధ్యక్షులు దేశంశెట్టి శంకర్రావు, నాయకులు కోన బుజ్జి, కె విమల నాయుడు, పంచదారల పైడిరాజు పాల్గొన్నారు.










