Sep 24,2023 21:48

ప్రజాశక్తి - పెనుమంట్ర
           విద్యార్థుల అభ్యున్నతికి మానవత స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని పలువురు వక్తలు అన్నారు. మానవత సంస్థ నెలవారీ సమావేశం జిల్లా అధ్యక్షులు బి.శ్రీనివాసరావు అధ్యక్షతన మార్టేరు మానవత కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. ఎస్‌విజిహెచ్‌ హైస్కూల్‌ హెచ్‌ఎం చిర్ల చిన సూర్యనారాయణ రెడ్డి, సూర్యతేజ, సూపర్‌ మార్కెట్‌ అధినేత సత్తి సత్యనారాయణ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఇద్దరు పేద విద్యార్థులకు రూ.ఐదు వేల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. కుంగుఫూ మాస్టర్‌ అరటికట్ల శ్రీనివాస ప్రభు మాట్లాడుతూ విద్యార్థుల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో మానవత చేస్తున్న ప్రోత్సాహకం మరువలేనిదన్నారు. మానవత అధ్యక్షుడు బి.శ్రీనివాసరావు చేతులమీదుగా కుంగ్‌ ఫు విద్యార్థులకు ప్రశం సపత్రాలను అందిం చారు. మానవత జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ మానవత చేస్తున్న సేవా కార్యక్రమాల్లో కుల, మత, పేద, ధనిక, రాజకీయాలకు అతీతంగా ప్రతిఒక్కరూ పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ప్రెసిడెంట్‌ కర్రి కృష్ణారెడ్డి, ఆత్మీయ సహకార కమిటీ ఛైర్మన్‌ చిర్ల శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి బండి ప్రసాద్‌, కోశాధికారి శ్రీనివాసుల మురళీకృష్ణ, జెడ్‌పిటిసి సభ్యులు కర్రి గౌరీ సుభాషిణి, ఉప సర్పంచి కర్రి వేణుబాబు, మానవత కమిటీ సభ్యులు పాల్గొన్నారు.