Aug 28,2023 00:30

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా: వసతి గృహంలో ఉంటూ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులకు తప్పనిసరిగా మెనూ ప్రకారం ఆహారం అందించాలని, నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ ఆదేశించారు. నరసరావుపేట సమీపంలోని లింగంగుంట్ల పరిధిలో గల ఎపి మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్‌ పాఠశాలను కలెక్టర్‌ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. 9, 10వ తరగతి విద్యార్థినులతో ముఖాముఖి మాట్లాడారు. ఃఆధునిక యుగంలో పురుషులకు దీటుగా మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని, విద్యార్థినులు దీన్ని గమనించి ఆత్మన్యూనతా భావాన్ని వదిలేయాలని సూచించారు. లక్ష్యాన్ని ఎంచుకుని పట్టుదలతో సాధించాలన్నారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు.