బకెట్టతో ఆవు పేడను మోస్తున్న విద్యార్థినులు
ప్రజాశక్తి -ముంచింగిపుట్టు:మండలంలో జోలాపుట్టు గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో విద్యార్థినులతో వెట్టిచాకిరీ చేయించిన ఘటన ఆదివారం వెలుగు చూసింది. పాఠశాల పరిసరాల ప్రాంతాలలో ఆరు బయట ఆవులు విసర్జించిన పేడను విద్యార్థులు సేకరించి బకెట్లలో తలపై మోసుకొని వెళ్ళుతూ ఈ బరువుకు ఇబ్బంది పడ్డారు. హాస్టల్ పరిశుభ్రతకు విద్యార్థులను వాడుకోవడం సరికాదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మండల కేంద్రంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలురు1 పాఠశాలలో పిక్నిక్ నిర్వహించిన అనంతరం టెంట్ హౌస్ సామాగ్రి, కుర్చీలను విద్యార్థులతో మోయిపించడం అప్పట్లో చర్చనీయాశంమైంది.ఈ విషయం మండల అధికారులకు సోషల్ మీడియా ద్వారా తెలిసినప్పటికీ కనీసం చలనం లేకుండా వ్యవహరించడం గమనార్ధం.










