Jul 18,2023 01:09
పర్చూరులో విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

ప్రజాశక్తి-పర్చూరు: రోటరీ క్లబ్‌ ఆఫ్‌ పర్చూరు సెంట్రల్‌ ఆధ్వర్యంలో పర్చూరులోని రోటరీ భవనం వద్ద విద్యార్థినులకు పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు ముఖ్య అతిథిగా పాల్గొని 57 సైకిళ్లను అందజేశారు. రోటరీ వారు చేస్తున్న సేవలను అందిపుచ్చుకొని విద్యలో రాణించాలని కోరారు. పర్చూరు ప్రాంత ప్రజలకు రోటరీ క్లబ్‌ వారు మంచినీటి పథకాల నిర్వహణ, ప్రజా మరుగుదొడ్లను చక్కగా నిర్వహిస్తూ మంచి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని కొనియాడారు. పర్చూరు రోటరీ క్లబ్‌ను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పర్చూరు, కారంచేడు మండ లంలోని స్కూళ్లకు సైకిళ్లను ఉచితంగా అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి పంబి సదానందరెడ్డి, సభ్యులు కొల్లా నరేంద్ర కుమార్‌, పాబోలు ఉదయ భాస్కర్‌, గడ్డిపాటి శ్రీనివాసరావు, భవనం రాజగోపాల్‌ రెడ్డి, దండా శ్రీనివాసరావు, కోట శ్రీనివాసరావు, ఏవీ కృష్ణారావు, పాబోలు వెంకన్న, ధూళిపాల సత్యం, కోమటి ఆంజనేయులు, కాసా అశోక్‌, కారుమూడి సుబ్బారెడ్డి, కోడూరి సుబ్రహ్మణ్యాచారి, స్కూలు అధ్యాపకులు, విద్యార్థులు, యాజమాన్యం పాల్గొన్నారు.