ప్రజాశక్తి - రంపచోడవరం
స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన బాలికలకు రాజమండ్రి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, మలబార్ గ్రూప్ సిఎస్‌ఆర్ కార్యక్రమాల్లో భాగంగా ప్రతిభ స్కాలర్ షిప్‌లను అందించింది. ఈ మేరకు రంపచోడవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినులు పదిమందికి సోమవారం రాజమహేంద్రవరం ఆనంద్ కళా కేంద్రంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.మాధవి లత, ఇంటర్ రీజినల్ జూనియర్ డైరెక్టర్ ఐ.శారద, డివిఈఓ జె వి సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా అందజేశారు. ఒక్కొక్కరికీ రూ.8వేలు నుంచి రూ.10వేలు చొప్పున అందించారు. ప్రతిభ స్కాలర్ షిప్‌లు పొందిన వారిలో పెంటపాటి జానకి పద్మశ్రీ, టి జ్యోతి, ఎస్ ఆశ్రిత, బి శ్రీదేవి, ఎన్ పూర్ణాంజలి, వి సాయి కీర్తన, కె బాలమణి, పి వసంతకుమారి, ఎస్ ప్రసన్నకుమారి, బి సోనీ ఉన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ వివివి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ మలబార్ సంస్థ తమ కళాశాలకు ఇటువంటి స్కాలర్ షిప్‌లు ఇవ్వడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమం ఎంఏవి రామకృష్ణ, పి భాస్కర రావు, టికె.విశాలాక్షి, ఎమ్మెస్ ఫణీంద్రుడు, ఏ.రాజ్ కుమార్, టి.వీర్రాజు, ఆర్‌ఎడి భవాని, ఎస్‌టివి ఆచార్యులు, ఎల్‌జె రామకృష్ణ పాల్గొన్నారు.










