Apr 28,2023 00:29

దేదీప్యసారుని అభినందిస్తున్న కలెక్టర్‌

ప్రజాశక్తి- బాపటజిల్లా : ఇంటర్‌ ఫలితాల్లో బాపట్ల విజిఆర్‌ఎం జూ నియర్‌ కళాశాల విద్యార్థిని ఆర్‌. దేదీప్యసాయి రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకు సాధించింది. 989/1000 మార్కులు సాధించింది. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా కలెక్టర్‌ రంజిత్‌ బాషా తన కార్యాల యంలో దేదీప్యసాయిని గురువారం అభినందించారు. ఉన్నత చదువులు చదివి మరిన్ని ర్యాంకులు సాధించాలని లెక్టరు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్‌ వత్తి విద్యా విద్యాశాఖ అధికారి ఆంజనేయులు, విజిఆర్‌ఎం కళాశాల డైరెక్టర్‌ అంబటి గిరిధర్‌, ఆదేళ్ళ విజరు కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.