Oct 05,2023 22:00

విద్యార్థికి ఆర్థిక సాయం చేస్తున్న సభ్యులు

 వల్లూరు స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల పూర్వపు విద్యార్థిని లింగాయపల్లి గ్రా మానికి చెందిన బి. హేమలతకు తేజ స్విని ఛారిటబుల్‌ ట్రస్ట్‌ అధ్యక్షులు మహేశ్వర్‌ రెడ్డి, ఆయన స్నే హితుల సహకారంతో రూ. 1వేల ఆర్థిక సాయం గురువారం అం దజేశారు. బి. హేమలత బీటెక్‌ చదువు కోసం పాఠశాల ఉపా ధ్యాయుల విజ్ఞప్తితో తేజస్విని ఛారిటబుల్‌ ట్రస్ట్‌ వారు ఆర్థికంగా సాయం చేశారు. కుమదబెన్‌ జోషి నగర్‌ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సి.వి సురేంద్ర మాట్లాడుతూ విద్యార్థులకు ఆర్థికంగా, హార్దికంగా, భౌతికంగా సహాయం చేయడంలో తేజస్విని ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ముందుంటుందని సభ్యులను అభినందించారు. పేద విద్యార్థిని హేమలతకు భవిష్యత్తులో ఉన్నత చదువు కోసం ఆర్థిక సహాయం చేస్తామని అధ్యక్షులు తెలిపారు. కార్యక్ర మంలో ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు జి.వి. సాయి ప్రసాద్‌, తేజస్విని ఛారిటబుల్‌ ట్రస్ట్‌ సభ్యులు చంద్ర పాల్గొన్నారు.