కార్యక్రమంలో మాట్లాడుతున్న అడ్వకేట్ లలిత
ప్రజాశక్తి - ఆదోని
విద్యార్థి దశ నుంచే సామాజిక సేవ పట్ల అవగాహన కలిగి, సేవా దృక్పథం కలిగి ఉండాలని గ్రీనరీ క్లబ్ అధ్యక్షులు అడ్వకేట్ లలిత పేర్కొన్నారు. శనివారం ఆదోని ఆర్ట్స్ కళాశాలలో నేషనల్ సర్వీస్ స్కీమ్ దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా లలిత హాజరై మాట్లాడారు. విద్యా సంస్థలో చదువుతున్న విద్యార్థి, యువతను సమాజ సేవ వైపు మళ్లించేందుకు ఎన్‌ఎస్‌ఎస్ ఓ దిక్సూచీ అన్నారు. ఆదోని కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ సహకారంతో పట్టణంలోని బైపాస్ రోడ్డుకు ఇరువైపులా, గోశాలలో 300 మొక్కలు నాటామని గుర్తు చేశారు. కళాశాల ప్రిన్సిపల్ మురళీ మోహన్, వైస్ ప్రిన్సిపల్ సురేష్, బాలస్వామి, ఎర్రిస్వామి, ఎన్‌ఎస్‌ఎస్ అధికారులు జోనాథన్, వెంకట్రామిరెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.










