Aug 17,2023 18:29

మైలవరంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతున్న సోమేశ్వర రావు

ప్రజాశక్తి - మైలవరం : విద్యారంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ఎం.సోమేశ్వరరావు విమర్శించారు. నూజివీడు రోడ్‌లోని గాంధీ గ్రంథాలయంలో గురువారం ఎస్‌ఎఫ్‌ఐ మండల ప్లీనరీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు సకాలంలో అమ్మఒడి, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన లాంటి పథకాలు రాకపోవటంతో పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవుతున్నారన్నారు. నాడు నేడు పేరుతో ప్రభుత్వం పాఠశాలలో అభివద్ధి చేస్తామని చెబుతున్నప్పటికీ పూర్తిస్థాయిలో పనులు కాకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు గురవుతున్నారు అన్నారు. ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని జూనియర్‌ కళాశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఇవ్వాలని నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ మైలవరం మండలం కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా ఎం చరణ్‌, కార్యదర్శిగా వి విజయలను ఎన్నుకొన్నారు. మరో ఏడుగురిని మండల కార్యదర్శి సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఎం కుమార్‌ నాయక్‌, సిఐటియు మండల కార్యదర్శి సిహెచ్‌.సుధాకర్‌, తదితరులు పాల్గొన్నారు.

  •