Jul 11,2023 17:29

ఎన్నికైన నూతన కమిటీ సభ్యులు

విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తే తగిన గుణపాఠం చెబుతాo - పిడిఎస్యు
ప్రజాశక్తి - నంద్యాల

     విద్యా రంగాన్ని నిర్లక్ష్యం చేస్తే తగిన గుణపాఠం చెబుతామణి, విద్యార్థులు చదువుతో పాటు సమాజాన్ని చదవాలని, అసమాన తలు లేని సమాజాన్ని సాధించు  కోవాలని పీడీఎస్ యూ జిల్లా అధ్యక్షులు ఎస్ .ఎం .డి . రఫీ అన్నారు. మంగళవారం పిడిఎస్యు నంద్యాల పట్టణ జనరల్ బాడీ సమావేశం పట్టణ కార్యదర్శి నవీన్  అధ్యక్షతన జరిగింది. నాలుగు గోడల మధ్య చదు వుతో పాటు, విద్యా రంగంలోని సమస్యలను పరిష్క రించాలని, వారి హక్కులను కాపాడుకోవాలని, దోపిడీ, అవినీతి లేని సమాజాన్ని ఆకాంక్షి స్తూ స్ఫూర్తి చైతన్యం కావాలని విద్యార్థులకు రఫీ పిలుపునిచ్చారు. సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ డివిజన్ కార్యదర్శి ఎం శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వ, ఎయిడెడ్, జిల్లా పరిషత్, మున్సిపల్ పాఠశాలల్లో  విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, పాఠశాలలు, టీచర్ పోస్టులను కుదించే 84,85,117 జీవో లను రద్దు చేయాలని, విద్యార్థుల సంఖ్య తక్కువుందనే పేరుతో ఎయిడెడ్ పాఠశాలల మూసివేతను విరామించుకోవాలని డిమాండ్ చేశారు.ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని, ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్ లో ఫీజుల దోపిడీని అరికట్టాలని,  ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం  (పిడిఎస్ యు) గా వారు డిమాండ్ చేశారు.కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యారంగాన్ని మనువాద భావాజాలంతో నింపడానికి నూతన జాతీయ విద్యావిధానం తీసుకు వచ్చిందని విమర్శించారు. దేశంలో సుమారు లక్ష పాఠశాలలు మూత పడ్డాయని అన్నారు. కేజీ టూ పీజీ వరకు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. విద్యా హక్కు చట్టానికి తూట్లు పొడుస్తున్నారని, ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్ విచ్చలవిడిగా ఫీజుల దోపిడీ చేస్తున్నాయని అన్నారు. ఫీజుల రెగ్యులేటరీ కమిషన్ సూచించిన ఫీజులను కాకుండా లక్షలాది  రూపాయలు గుంజుతున్నారని అన్నారు.  నారాయణ, శ్రీచైతన్య, భాష్యం వంటి కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా పాఠశాల విద్య అస్తవ్యస్తంగా మారిందని విమర్శించారు. నూతన జాతీయ విద్యా విధానం -2020 పేరుతో పాఠశాలలను ముక్కలు చేశారని, 84,85,117 జీవోలతో  పాఠశాలలను, టీచర్ పోస్టులను కుదిస్తున్నారని అన్నారు. 3,4,5 తరగతులను 1కి. మీ పరిధిలో హై స్కూల్స్ లో విలీనం చేయడంతో 4200 ప్రాధమిక పాఠశాలలు కనుమరుగయ్యాయని అన్నారు. ఎయిడెడ్ ప్రాధమిక పాఠశాలలో 30 మంది కంటే తక్కువుంటే, ప్రాధమికొన్నత పాఠశాలల్లో 35 మంది కంటే తక్కువుంటే, ఉన్నత పాఠశాలల్లో 75 మంది కంటే తక్కువుంటే వాటిని 3కి.మీ పరిధిలో విలీనం చేయాలని చూస్తున్నారని, దీనితో వందలాది ఎయిడెడ్ స్కూల్స్ మూతపడతాయని అన్నారు. మరోప్రక్క 6,7,8 తరగతుల విద్యార్థులు 30 మంది లోపు ఉంటే ఒక్క సబ్జెక్టు టీచర్ నే కేటాయిస్తామంటే మిగిలిన సబ్జెక్టుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. గత 4 సంవత్సరాలలో ఒక్క డియస్సీ వేయలేదని, పార్లమెంట్ లో 50677 టీచర్ పోస్టులు ఖాళీలున్నాయని కేంద్ర మంత్రి ప్రకటిస్తే రాష్ట్ర విద్యా శాఖా మంత్రి 714 పోస్టులు ఉన్నాయని ప్రకటించడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 9వేల ఏకోపాధ్యాయ పాఠశాలలు నడుస్తున్నాయని అన్నారు. టీచర్లు లేకుండా విద్యార్థులకు నాణ్యమైన విద్య ఎలా అందుతుందని ప్రశ్నించారు. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని, తక్షణమే 30 వేల పోస్టులతో డియస్సి  వేయాలని డిమాండ్ చేశారు. జగనన్న విద్యా కానుక కిట్లు ( పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, బ్యాగ్, షూస్, డిక్షనరీ, యూనిఫారం ) విద్యార్థులకు నేటికీ పూర్తిగా అందలేదని అన్నారు. నాడు - నేడు పనులు పూర్తికాక పోవడంతో  విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ అఫ్ ఇండియా లింక్ కాకపోవడం తో 1లక్ష 34 వేల మంది విద్యార్థులు అమ్మఒడికి దూరమౌతున్నారని అన్నారు.  మధ్యాహ్న భోజన పధకానికి నిధులు పెంచాలని, బైజూస్ ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.  విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ స్కూల్స్ లో  పూర్తి  స్థాయిలో 25 శాతం రిజర్వేషన్స్ అమలు చేయక పోవడంతో సుమారు 71 వేల సీట్లు మిగిలిపోయాయని అన్నారు. ప్రభుత్వం తక్షణమే మిగిలి పోయిన సీట్లను భర్తీ చేయాలని అన్నారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నంద్యాల  పట్టణ కమిటీ ఎన్నుకోవడం జరిగింది ,ఈ కమిటీ పి డి ఎస్ యు పట్టణ అధ్యక్షులుగా షైక్, షాహిద్, పట్టణ ప్రధాన కార్యదర్శిగా వినోద్, ఉపాధ్యక్షులుగా నవీన్, నాని, సహాయ కార్యదర్శులుగా గిరి ,శంకర్, కోశాధికారి అనిల్, తోపాటు మరో ఆరు మంది కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది.