ప్రజాశక్తి - కాకినాడ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగ అభివృద్ధికి విప్లవాత్మక సంస్కరణలను అమలుచేస్తోందని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకష్ణ అన్నారు. బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనంతపురం జిల్లా, నార్పలలో జగనన్న వసతి దీవెన పథకం లబ్ధి మొత్తాన్ని విద్యార్థుల తల్లుల ఖాతాలో నేరుగా జమచేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాకినాడ కలెక్టరేట్ నుంచి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎంపి వంగా గీత, కలెక్టర్ కతికా శుక్లా, కుడా ఛైర్‌పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి తదితరులు వర్చువల్‌గా హాజరయ్యారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు మంత్రి వేణుగోపాలకష్ణ ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి జగనన్న వసతి దీవెన లబ్ధికి సంబంధించిన మెగా చెక్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ, ఎంపి గీత మాట్లాడుతూ ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ. 10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ. 15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ. 20 వేలు చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం విద్యా ర్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా లబ్ధి మొత్తాన్ని జమచేస్తోందన్నారు. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. కాకినాడ జిల్లాలో జగనన్న వసతి దీవెన కార్యక్రమం కింద 42,433 మంది విద్యార్థులకు రూ. 40.27 కోట్ల మేర లబ్ధి చేకూరినట్లు జిల్లా కలెక్టర్ కతికా శుక్లా తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి జె.రంగలక్ష్మీదేవి, గిరిజన సంక్షేమ అధికారి ఎ.విజయ శాంతి, వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు హాజరయ్యారు.
కాజులూరు మండల అభివృద్ధి పనులపై మంత్రి సమీక్ష
కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాలులో బుధవారం మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ .. కలెక్టర్ కృతికా శుక్లాతో కలిసి కాజులూరు మండల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్షించారు. కాజులూరు మండలంలో రబీ కోతలు పూర్తవుతున్నందున రైతులకు ధాన్యానికి మద్దతు ధర కల్పించాలని, కూరాడ డ్రెయిన్‌లో గుర్రపుడెక్క తొలగింపు పూర్తి చేయాలని, ఆక్వా రైతులు చెరువులకు డ్రెయిన్లు సక్రమంగా పెట్టుకు నేలా అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. హౌసింగ్ సమీక్షలో మండలంలో మొత్తం 2443 మంది అర్హులను గుర్తించి 1972 మందికి పట్టాలు జారీ చేశామని, మరో 471 మంది లబ్దిదారులకు 10 ఎకరాలు భూసేకరణ చేపడుతున్నట్టు జెసి ఎస్.ఇలాక్కియా వివరించారు. దుగ్గుదూరు, గొల్లపాలెం పిహెచ్‌సిలలో వైద్యులు, సిబ్బంది నూరు శాతం భర్తీ చేశామని, భూ రీసర్వే ప్రక్రియ 12 గ్రామాల్లో పూర్తికాగా, మిగిలిన గ్రామాల్లో మూడు నెలలోపు సర్వే పూర్తి చేయస్తామని కలెక్టర్ కతిక వివరించారు. జగనన్న కాలనీలలో నిర్మాణాల వేగవంతానికి, నాడు నేడు రెండు దశల పనులన్నిటిని జూన్‌లోగా పూర్తి చేయాలని, అంగన్‌వాడీ కేంద్రాలలో మెరు గైన పోషకాహారం అందించాలని, డ్రిల్లింగ్ కార్యకలాపాల వల్ల ఉపాధి కోల్పో తున్న మత్స్యకారులకు ఒఎన్‌జిసి సంస్థ అందిస్తున్న పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు ఈ అంశాలపై ఆయా శాఖల అధికారులు పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
మెగా చెక్కును అందజేస్తున్న మంత్రి వేణు, ఎంపి గీత, కలెక్టర్ కృతికా శుక్లా










