ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
విద్యారంగ సమస్యలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేరుగా స్పందించాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డిటిఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్‌వి.రమణయ్య డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు కరె కృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రమణయ్య మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు మభ్యంతర భృతిని 25 శాతం ప్రకటించాలని, గతంలో పెండింగ్‌లో ఉన్న పిఆర్‌సి, డిఎ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇటీవల గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొందిన ఉపాధ్యాయులు కరిబసప్ప, వీరన్న, బజారప్ప, రాజశేఖర్, రియాజుద్దీన్‌ను సన్మానించారు. రాష్ట్ర కార్యదర్శి గోట్ల చంద్రశేఖర్, రత్నం, ఏసేపు, జిల్లా ప్రధాన కార్యదర్శి గట్టు తిమ్మప్ప, జిల్లా బాధ్యులు రామన్న, ఈశ్వర్ రెడ్డి, వెంకటరాముడు, వెంకటేశప్ప, నాగరాజు గౌడ్, గంగాధర్, మజాహర్ బాష, చంద్రశేఖర్ యాదవ్, తస్లీమా, వెంకటలక్ష్మి, మీనాక్షి, పుణ్యవతి, కృష్ణవేణి, మాలతి, నీలోఫర్, సాహిన్ పాల్గొన్నారు.
సంఘీభావం తెలుపుతున్న డిటిఎఫ్ నాయకులు










