Dec 15,2022 23:12

మాట్లాడుతున్న ఎమ్మెల్యే ముత్తంశెట్టి

ప్రజాశక్తి -భీమునిపట్నం : విద్యారంగ అభివృద్ధికి వైసిపి ప్రభుత్వం తొలి ప్రాధాన్యతనిస్తోందని ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. గురువారం రూ.నాలుగు కోట్ల రూసా నిధులతో నిర్మించిన స్థానిక ఎస్‌విఎల్‌ఎన్‌ఎస్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశా నూతన భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగాకళాశాలలో నిధుల లేమితో సగంలోనే నిలిచిన మరుగుదొడ్లను పూర్తిచేయాలని, కాలేజీకి అప్రోచ్‌ రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యేకు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఆర్‌.మంజుల విజ్ఞప్తి చేశారు. 2009 నుంచి ఖాళీగా ఉన్న బయోలజీ, జువాలనీ, కెమెస్ట్రీ అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపిపి దంతులూరి వెంకటశివ సూర్యనారాయణ రాజు, జెడ్‌పిటిసి గాడు వెంకటప్పడు, ఎఎంసి చైర్మన్‌ యలమంచిలి సూర్యనారాయణ, జివిఎంసి కోఆప్షన్‌ సభ్యులు కొప్పల ప్రభావతి, జోనల్‌ కమిషనర్‌ ఎస్‌.వెంకటరమణ, పిఎసిఎస్‌ అధ్యక్షులు అక్కరమాని రామునాయుడు, సర్పంచ్‌ గాడు వెంకటనారాయణ, ఎంపిటిసి చెల్లూరి నగేష్‌బాబు, వైసిపి నేతలు కొప్పల రమేష్‌, పొట్నూరు చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.