Nov 09,2023 21:49

ఆర్‌జెడి జ్యోతికుమారికి స్వాగతం పలుకుతున్న డిఇఒ, ఎంఇఒలు

పార్వతీపురం టౌన్‌: జిల్లాలో విద్యారంగ అభివృద్ధికి మండల విద్యాశాఖాధికారులు కృషి చేయాలని విశాఖపట్నం జోన్‌-1 ఆర్‌జెడి జ్యోతి కుమారి కోరారు. గురువారం స్థానిక డిఇఒ కార్యాలయాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా డిఇఒ ఎన్‌.ప్రేమ కుమార్‌ ఆర్‌జెడికి స్వాగతం పలికారు. ఇదే సందర్భంగా జిల్లా ఎంఇఒల సంఘం అధ్యక్షులు సామల సింహాచలం, జిల్లా ఉపాధ్యక్షులు ఎం.వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి ఎన్‌.నాగభూషణరావు, ట్రెజరర్‌ ఎం.శ్రీనివాసరావు ఆర్‌జెడిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆర్‌జెడి మాట్లాడుతూ పాఠశాలలు తరచూ తనిఖీ చేసి రిపోర్టులు అందజేయాలన్నారు. మన్యం జిల్లా పదో తరగతి ఫలితాల్లో శత శాతం సాధించేలా కృషి చేయాలని ఎంఇఒలను కోరారు.