Nov 19,2023 22:22

ప్రజాశక్తి - భట్టిప్రోలు 
స్థానిక మాటూరు గ్రంధాలయం వారోత్సవాల్లో భాగంగా మహిళలు, విద్యార్థులకు రంగువల్లుల పోటీలు ఆదివారం నిర్వహించారు. పోటీలకు గ్రామంలోని మహిళలు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. న్యాయ నిర్ణీతలుగా మెడపాటి భవాని వ్యవహరించారు. మహిళా పోలీస్ తిరుమల మాట్లాడుతూ మహిళా సాధికారత, దిశ చట్టంపై అవగాహన కల్పించారు. దిశా చట్టంలోని పలు అంశాలను వివరించారు. మహిళలకు చట్టం ప్రాధాన్యతను తెలిపారు. ముగ్గుల పోటీల్లో జూనియర్ విభాగం నుండి ఏ హాసినిప్రియా, ఎ వెన్నెల, కె మహాలక్ష్మి, సీనియర్స్ విభాగంలో అల్లం జాహ్నవి, నందం సేవిక, కరెంశెట్టి హేమనాగమణి, బుర్లె ప్రవళిక బహుమతులు సాధించారు. కార్యక్రమంలో పుస్తక పంపిణీ నిర్వాహకులు నీల నాగమణి, లైబ్రేరియన్ కరపాల సుభాష్ చంద్రబోస్ పాల్గొన్నారు.
కొల్లూరు : గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా ఆదివారం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా అసిస్టెంట్ సబ్ ఇన్స్‌పెక్టర్ ఎన్ రామయ్య, హోంగార్డు మహేష్ ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనముగా నివాళులు అర్పించారు. గ్రంథాలయ అధికారి వై రాంబాబు అధ్యక్షతన జరిగిన సభలో ఎస్‌ఐ రామయ్య మాట్లాడుతూ దేశానికి ఇందిరా గాంధీ చేసిన సేవలు కొనియాడారు. అనేక రంగాలలో దేశాన్ని ముందుకు తీసుకుని వెళ్లారని అన్నారు. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా దిశ చట్టం, దిశ యాప్ గురించి, మహిళల సాధికార వ్యవస్థ గురించి  వివరించారు. విద్యార్థులకు ముగ్గులు పోటీలు నిర్వహించి విజేతలను ఎంపిక చేశారు. వారోత్సవాల ముగింపు రోజు పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. మండలంలోని అనంతవరంలో గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ముగ్గులు పోటీలు, జాతీయ గీతాల ఆలాపన పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి జి కనకదుర్గ పాల్గొన్నారు.