ప్రజాశక్తి - చీరాల
తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులని పలువురు వక్తలు పేర్కొన్నారు. తెలుగు భాషాదినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం పలు చోట్ల గిడుగు జయంతి వేడుకలు నిర్వహించారు. పేరాల ఆంధ్రరత్న పురపాలక ఉన్నత పాఠశాలలో జరిగిన జయంతి సభలో గిడుగు రామ్మూర్తి పంతులు, హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ చిత్రపటాలకు ఉపాధ్యాయులు, విద్యార్థులు కలసి పూలమాలలతో నివాళులర్పించారు. గిడుగు రామ్మూర్తి పంతులు గురించి హెచ్‌ఎం బి సాల్మన్ వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతి ప్రధానం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమణరావు, సుందరరామిరెడ్డి, చంద్రశేఖర్, శివ వరప్రసాద్, పవని భానుచంద్రమూర్తి, రాజేంద్రప్రసాద్, గాంధీ పాల్గొన్నారు.










