Nov 18,2023 00:17

ప్రజాశక్తి - నగరం
గోవాలో 37వ జాతీయస్థాయి క్రీడలు నిర్వహించారు. క్రీడల్లో స్థానిక  శ్రీ వెలగపూడి రామకృష్ణ స్మారక కళాశాల బిసిఎ విద్యార్థిని ఎన్ గాయత్రి కయాకింగ్ కానోయింగ్ (వాటర్ రైస్)లో అద్వితీయ ప్రతిభ కనబరిచింది. జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానం సాధించినారు. ఈ సందర్భంగా కళాశాలలో అభినందన సభ శుక్రవారం నిర్వహించారు. సభలో ప్రిన్సిపాల్ డాక్టర్ అనగాని హరికృష్ణ మాట్లాడుతూ మన కళాశాల విద్యార్థిని గాయత్రి జాతీయస్థాయిలో ద్వితీయ స్థానం సాధించడం సంతోషమని అన్నారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ వల్లభనేని బుచ్చయ్య చౌదరి విద్యార్ధిని గాయత్రిని అభినందించారు. విద్యార్థినీ, విద్యార్థులు క్రీడల్లో రాణించాలని కోరారు. క్రీడాకారులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు.  జాతీయస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన గాయత్రీకి నగదు బహుమతి అందజేశారు. కొసరాజు రమణమూర్తి విద్యార్థినికి అభినందనలు తెలిపారు.  కార్యక్రమంలో కళాశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మాగంటి సుధాకరరావు, ఆఫీస్ సూపరిండెంట్ అమరేష్‌రెడ్డి, వల్లభనేని విష్ణువర్ధనరావు, పిడి వి సాంబమూర్తి పాల్గొన్నారు.