ప్రజాశక్తి - పెద్దకడబూరు
పెద్దకడబూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు రామ్మూర్తి ఆధ్వర్యంలో జగనన్న విద్యాకానుక కిట్లను పంపిణీ చేశారు. సోమవారం వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ పురుషోత్తం రెడ్డి, ఎంపిపి శ్రీవిద్య, వైసిపి మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి చేతులమీదుగా విద్యార్థులకు పంపిణీ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పేద విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లు వరం లాంటివని తెలిపారు. ప్రతి విద్యార్థీ జగనన్న విద్యా కానుక కిట్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థీ ఉన్నత చదువులు చదవాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు కోసం దాదాపు రూ.1000 కోట్లు ఖర్చు చేసి విద్యా కానుక కిట్లను అందజేస్తున్నారని తెలిపారు. పాఠశాల కమిటీ ఛైర్మన్ బరుసబ్బు, అనిల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కిట్లను పంపిణీ చేస్తున్న నాయకులు










