ఖాసింఖాన్‌ను సన్మానిస్తున్న ఖాదర్‌బాష
కడప అర్బన్ విద్యాసాధన విద్యా సంస్థలు, గుడ్ బర్డ్ ఇంటర్నేషనల్ హైస్కూల్ అధినేత లయన్ పఠాన్ ఖాసింఖాన్ సేవలు అభినందనీయమని జెకె యూత్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు ఖాదర్ బాష అన్నారు. శనివారం విద్యాదాతను సన్మానించారు. ఈ సందర్భంగా ఖాదర్‌బాష మాట్లాడుతూ అన్న, ధన, విద్యా ధానం చేయడం హర్షనీయమని పేర్కొన్నారు. రవీంద్రనగర్‌లో ఉన్న యువత విద్య కోసం ప్రతి ఏడాది రూ.20వేలు ఇవ్వడానికి ముందుకు రావడం గొప్పవిషయమన్నారు. కార్యక్రమంలో ఆర్కే సేవా సమితి అధ్యక్షులు కరీముల్లా, జెకె నగర నాయకులు సలీంబాష పాల్గొన్నారు.










