Jan 09,2023 23:56

మాట్లాడుతున్న జెడ్పీటీసీ గిరిబాబు

ప్రజాశక్తి-గొలుగొండ:విద్యాభివృద్ధికి సీఎం జగన్‌ విశేషంగా కృషి చేస్తున్నారని జెడ్పీటీసీ సుర్ల గిరిబాబు, ఎంపిపి గజ్జలపు మణికుమారి తెలిపారు. స్థానిక కేజీబీవీ పాఠశాలలో 8వ తరగతి విద్యార్ధినులకు సోమవారం ట్యాబ్‌లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విద్యకి అధికంగా ప్రయోజనాలు చేకూరుస్తున్నారని, దీంతో పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు.గత ప్రభుత్వాలు హంగు, ఆర్భాటాలకి ఖర్చు చేస్తే ప్రస్తుత ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతిస్తూ రాష్ట్రాన్ని సంక్షేమంతో పాటు అభివృద్ధి పథంలో నడిపిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షులు లెక్కల సత్యనారాయణ, స్థానిక సర్పంచ్‌ కసిపల్లి అప్పారావు, ఉప సర్పంచ్‌ సానాపతి రమేష్‌, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు