
గొరగనమూడి సర్పంచి శివాజీరాజు
ప్రజాశక్తి - పాలకోడేరు
విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని గొరగనముడి సర్పంచి గొట్టుముక్కల వెంకట శివరామరాజు (శివాజీరాజు) అన్నారు. గొరగనమూడి స్వామి జ్ఞాననంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.69 లక్షలతో జరుగుతున్న నాడు-నేడు పనులను పాఠశాల తల్లిదండ్రుల కమిటీ ఛైర్మన్ పొన్నమండ బాలకృష్ణతో కలిసి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచి శివాజీరాజు మాటా ్లడుతూ నాడు-నేడుతో పాఠశాలలను ప్రభుత్వం అబి óవృద్ధి చేస్తుందన్నారు. తల్లిదండ్రుల కమిటీ ఛైర్మన్ బాలకృష్ణ మాట్లాడుతూ వైసిపి అధికారం చేపట్టాక పాఠశాలలు, విద్యపై ప్రత్యేకంగా దృష్టి సారించిందన్నారు. ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి ఉన్నారు.