Nov 17,2022 23:23

నాడు, నేడు అభివద్ధి పనుల కు శంకుస్థాపన చేస్తున్నఎమ్మెల్యే ముత్తంశెట్టి

ప్రజాశక్తి -భీమునిపట్నం : వైసిపి ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి అగ్ర తాంబూలం వేస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. గురువారం స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో రెండో విడత నాడు-నేడు నిధులు రూ.కోటి 26లక్షల 56 వేలతో నిర్మించనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.పనులను నిర్ణీత గడువులో, నాణ్యతతో చేపట్టాలని సూచించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడుతూ, గతంలో ఏ ప్రభుత్వమూ విద్య, వైద్య రంగాలకు ఇంతటి ప్రాధాన్యత ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల భవన నిర్మాణాలు, గడప గడపకు మన ప్రభుత్వంలో వచ్చిన అర్జీల మేరకు ప్రత్యేక నిధులతో చేపట్టే అభివృద్ధి పనులు కళ్లెదుటే కనిపిస్తుంటే, విపక్షాలు లేనిపోని ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌ పి ఉమారాణి అధ్యక్షతన జరిగిన సభలో జెడ్‌సి ఎస్‌.వెంకటరమణ, కార్పొరేటర్‌ గంటా అప్పలకొండ, పిఎసిఎస్‌ అధ్యక్షులు అక్కరమాని రామునాయుడు, జివిఎంసి కో ఆప్షన్‌ సభ్యులు కొప్పల ప్రభావతి, మాజీ కౌన్సిలర్లు కొప్పల రమేష్‌, మైలపల్లి అక్ష్ష్మణ రావు, వైసిపి నేతలు ఎం షణ్ముఖరావు పాల్గొన్నారు.అంతకుముందు ఇదే ప్రాంగణంలోని ప్రభుత్వ ఉన్నతపాఠశాలలోనూ రూ.99.44లక్షల నాడునేడు నిధులతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేశారు.