
ప్రజాశక్తి-యర్రగొండపాలెం
రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్‌జగన్మోహన్‌రెడ్డి పెద్దపీట వేశారని ఎంపిపి దొంతా కిరణ్‌గౌడ్ అన్నారు. శుక్రవారం యర్రగొండపాలెంలోని ఆర్డీటీ ఆడిటోరియంలో ప్రభుత్వ పాఠశాలలకు మంజూరైన వంట పాత్రలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కిరణ్‌గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిరోజూ ప్రత్యేక మెనూను ఏర్పాటు చేసి రుచికరమైన ఆహార పదార్ధాలు, రాగిజావ, కోడిగుడ్లు, చిక్కీలు అందజేయడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమం పక్క రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలుస్తుందన్నారు. వంట పాత్రలను జాగ్రత్తగా వినియోగించుకొని తద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని చెప్పారు. ప్రతి ఇంట్లోని పిల్లలందరూ తప్పకుండా పాఠశాలలకు వెళ్లేలా కృషి చేయాలన్నారు. ఇంకా జడ్పిటిసి చేదూరి విజయభాస్కర్, సర్పంచ్ రామావత్ అరుణాబాయి, ఎంఈవోలు ఆంజనేయులు, మల్లూ నాయక్, వైసీపీ అధికార ప్రతినిధి నర్రెడ్డి వెంకటరెడ్డి, మండల సచివాలయాల కన్వీనర్ జబివుల్లా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, సిఆర్‌పిలు, వంటలక్కలు పాల్గొన్నారు.