Mar 19,2023 22:52

ప్రజాశక్తి-నందిగామ : రాష్ట్ర బడ్జెట్‌ విద్యా అభివద్ధికి తోడ్పడటం లేదని ఎస్‌ఎఫ్‌ఐ నందిగామ డివిజన్‌ కార్యదర్శి గోపినాయక్‌ విమర్శించారు.ఆదివారం నందిగామ సుందరయ్య భవన్‌ లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మాట్లా డుతూ 2023-24 సంవత్సర రాష్ట్ర బడ్జెట్‌లో విద్యా రంగానికి బడ్జెట్‌లో అరకొరగా నిధులు కేటాయించినట్లు స్పష్టమవు తోందన్నారు. అధిక సంఖ్యలో చూపిస్తున్న గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కేటాయింపులు 0.2 శాతం తగ్గాయన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో 30శాతం కేటాయించాలని కోరారు. కానీ రాష్ట్ర బడ్జెట్‌ 10.6 శాతానికి మించలేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందని గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం నేడు అమ్మఒడికి 6500 కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. యూనివర్సిటీలకు కేటాయించిన నిధులు వాటి అభివద్ధికి నోచుకోవడం లేదని విమర్శించారు. సాంకేతిక విద్యలో ఎప్పటిలాగానే కొత్త కాలేజీలకు గానీ, ఉన్న భవనాల అభివద్ధికి గానీ బడ్జెట్‌ లో కేటాయింపులు లేవు అన్నారు. ప్రభుత్వ హాస్టళ్ల భవనాల కింద అభివద్ధి చేస్తామన్న ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు హసేన్‌,కోటేశ్వరావు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.