Jan 11,2023 23:54

చోడవరంలో బోగి మంటలు వేస్తున్న విద్యార్థులు

ప్రజాశక్తి-అనకాపల్లి:మండలంలోని గొలగాం పంచాయతీ కొత్త తలారివాని పాలెం ప్రాథమిక పాఠశాలలో బుధవారం సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. హరిదాసు, బుడబుక్కల వేషధారణ, డుడు బసవన్న, జంగమ దేవర వంటి వేషాలతో పాటు విద్యార్థులు సాంప్రదాయ దుస్తులతో అలరించారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులు వేసిన రంగురంగుల ముగ్గులు ఆకట్టుకున్నాయి. పాఠశాలలో పండగ వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో పాఠశాల ప్రధానో పాధ్యాయులు రెడ్డి నారాయణరావు, ఉపాధ్యాయులు జె.ఉషాకుమారి, స్కూల్‌ కమిటీ చైర్మన్‌ నారపిన్ని బాబురావు, ఎం.లోవలక్ష్మి, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
స్థానిక బైపాస్‌లోని ప్రశాంతి నికేతన్‌ ఎంవివిఎస్‌.మూర్తి ఇంగ్లీష్‌ మీడియం స్కూల్లో విద్యార్థులు పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. భోగి మంట వేసి, రకరకాల రంగవల్లులు, హరిదాసు కీర్తనలు, కోడి పందాలు, గాలిపటాలు, గోదాదేవి అలంకరణలతో తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్‌ డివి శ్రీనివాసరావు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
స్థానిక డైట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా సంప్రదాయ పిండి వంటలు, గాలిపటాలు, పెయింటింగ్‌, స్లో సైక్లింగ్‌ వంటి వాటిలో పోటీలు నిర్వహించారు. కళాశాల చైర్మన్‌ దాడి రత్నాకర్‌ విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ డాక్టర్‌ చెల్లా నరసింహం, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఆర్‌ వైకుంఠరావు, డీన్‌ అడ్మిన్‌ డాక్టర్‌ కె ఎస్‌ ఈశ్వరరావు, విద్యార్థులు పాల్గొన్నారు.
కశింకోట : కశింకోట సెయింట్‌ జాన్స్‌ స్కూల్‌లో సంక్రాంతి సంబరాలు సందర్భంగా విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి రంగు రంగుల ముగ్గులు వేశారు. గొబ్బెమ్మలు పెట్టారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్‌ బత్తుల నోబెల్‌ కుమార్‌, కరస్పాండెంట్‌ బత్తుల అనురాధ, ప్రిన్సిపాల్‌ మహేష్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
బుచ్చయ్యపేట : మండలంలోని దిబ్బిడి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. గ్రామీణ సంస్కృతి, వృత్తులు ఉట్టిపడే విధంగా వివిధ రకాల వేషధారణలతో కళారూపాలను వేయించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. బుచ్చయ్యపేట జాజిమొగ్గల ఇంగ్లీష్‌ మీడియం హైస్కూల్లో భోగి మంటలు, హరిదాసు వేషాలు, గంగిరెద్దులు వేషాలు వేయించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బుద్ధ కాశి, ఉపాధ్యాయులు వమ్మి అప్పారావు, ప్రిన్సిపాల్‌ జాజిమొగ్గల శ్రీనివాసరావు, విద్యార్థులు పాల్గొన్నారు.
చోడవరం : స్థానిక ఆడమ్స్‌ హైస్కూల్లో సంక్రాంతి సంబరాలు సందర్భంగా విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి ముగ్గులు వేసి భోగి మంటను వెలిగించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్‌, బద్రి మహంతి ఫాల్గుణ మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా పెద్దలను గుర్తు చేసుకుంటామని, వారిని స్మరించుకొని వాళ్లకి కొత్త బట్టలు, నైవేధ్యం పెట్టి పూజిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ రజిత, ప్రధానోపాధ్యాయులు వివి సుబ్బారావు, ఉష, దయామణి, హరిత, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
మునగపాక రూరల్‌ : మండలంలోని వాడ్రాపల్లి జెడ్పీ హైస్కూల్‌లో సంక్రాంతి సంబరాలు సందర్భంగా విద్యార్థులు భోగి మంటలు వేసి సందడి చేశారు. ముగ్గుల పోటీలు, గాలిపటం పోటీలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్‌ నూకరాజు చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రధానోపాధ్యాయులు బి.రత్నరాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
రోలుగుంట: మండలంలోని కొంతలం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో బుధవారం సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. హరిదాసు, రైతు, బ్రాహ్మనుడు, డాక్టర్‌, లాయర్‌, గ్రామీణ వృత్తుల వంటి వేశాలతో విద్యార్థులు అలరించారు. భోగి మంట, ముగ్గులు పోటీలు, క్షీరన్నం చక్కగా తయారు చేసారు. హెచ్‌ఎం బివి.రమణ సంక్రాంతి పండుగ విశిష్ఠత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు అప్పారావు, మూర్తి, కిరణ్‌, రమణ, చిన్నయ్యదొర, త్రినాధ్‌రావు, శివ ప్రసాద్‌, సత్తిబాబు, సంతోషి, విజయలక్ష్మి, దనలక్ష్మీ, వరలక్ష్మి పాల్గొన్నారు.
పాయకరావుపేట:శ్రీ ప్రకాష్‌ విద్యా సంస్థలో సంక్రాంతి వేడుకలు ఘనంగా బుధవారం నిర్వహించారు. సంప్రదాయ, మానవతా విలువలు చాటి చెప్పే విధంగా పలు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ భానుమూర్తి, ప్రధానోపాధ్యాయురాలు సంధ్యారాణి, ఉషారాణి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.