రాయచోటి టౌన్ : కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణం పూర్తి చేయాలని, విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రయివేట్ పరం చేయొద్దని ఈ నెల 8న నిర్వహించే విద్యా సంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎస్.నరసింహ, పిడి ఎస్‌యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.అంకన్న, ఎఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి పి.కోటేశ్వరరావు, ఎఐఎస్‌ఎ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.లవకుమార్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రమణ పిలుపునిచ్చారు. బంద్‌కు సంబందించిన పోస్టర్లను శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణం చేపట్టాలని దశాబ్దాలుగా జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్న, ప్రభుత్వాలు మాత్రం శిలాఫలకాలకే పరిమితం అయ్యయన్నారు. బ్రాహ్మణి ఉక్కు పరిశ్రమ పేరుతో భారీ పరిశ్రమకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వం, తరువాత వచ్చిన ప్రభుత్వాలు ఎన్నికలను దష్టిలో పెట్టుకొని శంకుస్థానలు, నిర్మాణం పూర్తి చేస్తామని హామీలు మాత్రం ఇస్తూ వస్తున్నాయని పేర్కొన్నారు. చివరికి తక్కువ సామర్థ్యంతో పరిశ్ర మను పూర్తి చేసేందుకు ఇప్పటి ప్రభుత్వం శంకస్తాపన చేసిందన్నారు. డిగ్రీలు, ఇంజినీరింగ్, ఎంబిఎ, ఎంసిఎ చదువుకున్న యువత బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్‌కు వలస వెళుతున్నారని తెలిపారు. ఇక్కడ నిర్మాణ దశలో ఆగిపో యిన గతంలోని భారీ పరిశ్రమ పూర్తతే అభివద్ధి శరవేగంగా జరుగుతుం దన్నారు. ఇప్పటికే నీళ్లులేక వర్షాలు లేక కరువుతో ఉన్న ఈ ప్రాంతం కడప ఉక్కు పరిశ్రమ వస్తే భారీగా అభివద్ధి జరుగుతుందన్నారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులకు ఇక్కడే వేలాది మందికి ఉపాది దొరుకుతుందని పేర్కొన్నారు. దీని కోసం విద్యార్థులు, యువకులు కలిసి నవంబర్ 8న జరిగే బంద్‌ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చరు. రాష్ట్రానికే తలమానికంగా ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రయివేట్ పరం చేయడానికి కేంద్ర సిద్దపండిదని ఛత్తీస్‌ఘడ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయని కేంద్ర బిజెపి నాయకత్వం అక్కడ దొరికే ఇనుప ఖనిజంతో ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ రంగంలో నిర్మిస్తామని ఎన్నికల సందర్బంగా హామీ ఇచ్చిందన్నారు. ఇదంతా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాజకీయాల కోసం కార్పొరేట్ వ్యక్తుల కోసం విశాఖ ఉక్కును బలి చేస్తున్నారని పేర్కొన్నారు. దీనిని తిప్పి కొట్టెందుకు రాష్ట్ర వ్యాప్త బంద్‌ను జయప్రదం చేయని కోరారు. కార్యక్రమంలో వామపక్ష విద్యార్థి, యువజన సంఘం జిల్లా నాయకులు, వినోద్, హేమంత్, ఖాదర్ బాషా, షరీఫ్, వెంకటేశ్వరరెడ్డి, నిత్య, సురేష్ పాల్గొన్నారు.మదనపల్లె అర్బన్: విద్యా సంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎస్.నరసింహ, ఎఐఎస్‌ఎఫ్ జిల్లా కోశాధికారి కె.వినరు, పిలుపునిచ్చారు. బంద్‌కు సంబందించిన పోస్టర్లను బిటి.కళాశాలలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో వామపక్ష విద్యార్థి సంఘం నాయకులు కమలాకర్, కార్తీక్, ముఖేష్, నరసింహులు, హరి, భరత్, రెడ్డిరాణి, శ్రావని, తేజస్విని, రాజ్ కుమార్, పావని, విశ్వ పాల్గొన్నారు.