Oct 31,2023 23:38

ప్రజాశక్తి - గోపాలపురం నవంబర్‌ 8న జరిగే రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షులు చింతలపూడి సునీల్‌ పిలుపునిచ్చారు. మంగళవారం గోపాలపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో బంద్‌ పోస్టర్లను ఆవిష్కరించారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటీకరణ నిలుపుదల చేయాలని కార్మికులు చేపట్టిన పోరాటం 1000 రోజులు అవుతున్న సందర్భంగా, కడప ఉక్కు ఫ్యాక్టరీని నిర్మించాలనే డిమాండ్‌తో జరుగుతున్న విద్యా సంస్థల బంద్‌లో కేజి నుంచి పిజి వరకూ విద్యా సంస్థల విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయలన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఎ.సునీల్‌, సిహెచ్‌ సురేష్‌, కడిమి శంకర్‌, ఎండ్రపాటి పేడ్రిక్‌, విద్యార్థులు పాల్గొన్నారు.