
పల్నాడు జిల్లా: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయి వేట ీకరణ, కడప ఉక్కు సాధన , సంక్షేమ హాస్ట ల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఇంటర్, డిగ్రీలలో పెరిగిన ఫీజులు తగ్గిం చాలని, నిత్యావసర వస్తువుల ధరలకు అను కూలంగా హాస్టల్ మెస్ చార్జీలు పెం చాలని కోరుతూ విద్యార్థి, యువజన సం ఘాలు చేపట్టిన బంద్ పల్నాడు జిలా ్లలో విజయవంతమైంది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు కళాశాలలు మూస ివేశారు. జిల్లాలోని, మాచర్ల, పిడుగురాళ్ల, దాచేపల్లి, పెద్దకర్లపాడు , చిన్న గార్లపాడు, బ్రాహ్మణపల్లి, తుమ్మల చెరువు, సత్తెనపల్లి, నరసరావుపేట, చిలకలూరిపేట, కోసూరు వివిధ మండలాల్లో అన్ని విద్యా సంస్థలు బంద్ సందర్భంగా మూసి వేశారు. ఈ బంద్‌ను అడు ్డకోవా లని రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులపై పోలీ సులు ద్వారా నిర్బంధం చేయాలని ప్రయత్నించిన్నప్పటికీ విద్యార్థి, యువజన సం ఘాలు ఎక్కడా వెనక్కి తగ్గకుండా బంద్ విజయవంతం చేశా మని పల్నాడు జిల్లా అధ్యక్షులు కె.సాయి కుమార్ పేర్కొ న్నారు.ఎస్.ఎఫ్.ఐ, డి.వై. ఎఫ్.ఐ, విద్యార్థి, యువజన సంఘాలు బంద్‌లో పాల్గొ న్నాయి. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఇ.ఆంజనేయ రాజు, ఎస్ ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు రాజు, జిల్లా నాయ కులు మండల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. మాచర్ల : స్థానిక బస్టాండ్ సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ పల్నాడు జిల్లా అధ్యక్షులు రాజు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రెవేటీకరణ చర్య లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాను కోవాలని డిమాండ్ చేశారు. సిఐటియు నేత బండ్ల మహేష్ మాట్లాడుతూ ఎన్ని కల వాగ్దానమైన కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణ పనులు ప్రారంభించాలన్నారు. ఉపా ధ్యక్షులు కె జ్యోతిష్‌కుమార్, విను కొండ పట్టణ కార్యదర్శి చైతన్యకుమార్, నరేష్, దుర్గారావు పాల్గొన్నారు. వినుకొండ: వినుకొండలో విద్యాసంస్థల బంద్ సంపూర్ణంగా జరిగిందని టిఎన్‌ఎస్‌ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షుడు నర్రా కిషోర్ తెలిపారు. సంఘీభావంగా బంధు విజ యవంతం చేసినట్టు చెప్పారు. కార్య క్రమంలో ఏఐవైఎఫ్ అధ్యక్షుడు సాగర్ , పల్నాడు జిల్లా టీఎన్‌ఎస్‌ఎఫ్ అధికార ప్రతినిధి వీరగంధం ప్రశాంత్, వినుకొండ మండల కార్యదర్శి మాదినేని లక్ష్మణ్, అధ్య క్షుడు శశి, టిఎన్‌ఎస్‌ఎఫ్ నాయ కులు సంతోష్, శ్రీకాంత్, గోపాల్, జగదీష్, నాగేంద్ర, బ్రహ్మం, మాలిక్ ఏఐ ఎస్‌ఎఫ్ నాయకులు పాల్గొన్నారు. బెల్లంకొండ : బెల్లంకొండ జూనియర్ కాలేజీలో కూడా బంద్ నిర్వహించారు. కార్య క్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మాజీ నాయకులు సిహెచ్ పుల్లారావు విద్యార్థులు చిరంజీవి, సాదిక్ వెంకట సాయి,ఎం సుభాని, ఎం ఎస్ కె మస్తాన్వలి, రాజేష్ బాబు, అజరు నాయక్ పాల్గొన్నారు. పెదకూరపాడు: సిపిఐ , యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యాసంస్థలను బంద్ చేయిం చారు. ఈ జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంటా గోపి, నియోజవర్గ సిపిఐ కార్యదర్శి మునుగోటి శ్రీనివాసరావు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ విభజన హామీల ప్రకారం ప్రభుత్వ రంగంలో నిర్మిం చాల్సిన కడప ఉక్కు పరిశ్రమను ప్రైవేటు రం గంలో నిర్మించటం రాష్టానికి పాల కులు చేస్తున్న ద్రోహం అన్నారు. కార్య కమంలో యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు ముప్పర ఉదయ శంకర్ , అబ్దుల్ రహీం, హాలీ, శివాజీ, గోపి , వెంకట్రావు , నాగేశ్వరరావు పాల్గొన్నారు.