కడప అర్బన్ : విద్యార్థి యువజన సంఘాలు ఉక్కు రక్షణ, ఉక్కు సాధన కోసం నిర్వహించిన బంద్ విజయవంతమైంది. బుధవారం జిల్లాలో అన్ని విద్యా సంస్థలు బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. విద్యా సంస్థలు మూతపడ్డాయి. విశాఖ ఉక్కు రక్షణ, కడప ఉక్కు నిర్మాణం కోసం ఎస్‌ఎఫ్‌ఐ, ఎఎస్‌ఎఫ్, డివైఎఫ్‌ఐ, పిడిఎస్‌యు, ఎఐవైఎఫ్, ఆర్‌ఎస్‌వైఎఫ్, నిరుద్యోగ జెఎసి సంఘాల ఆధ్వర్యంలో ఇచ్చిన బంద్ చేపట్టారు. కడప నగరంలోని కేజీ టు పీజీ వరకు ప్రయివేట్ విద్యా సంస్థలు ముందుగానే విద్యార్థులకు సెలవు ప్రకటించాయి. ప్రభుత్వ విద్యా సంస్థలను విద్యార్థి, యువజన సంఘాల నాయకులు వెళ్లి బంద్‌కు మద్దతి ఇవ్వమని కోరగానే అన్ని సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఎఐఎస్‌ఎఫ్ అఖిల భారత కార్యదర్శి దినేష్, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రాజేంద్రప్రసాద్, ఎఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి బాలరాజు, ఎఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు దస్తగిరి, పిడిఎస్‌యు జిల్లా నాయకులు శ్రీనాథ్, ఆర్‌ఎస్‌వైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శంకర్, నిరుద్యోగ జెఎసి రాష్ట్ర కన్వీనర్ సిద్ధికి మాట్లాడుతూ విద్యార్థులు, యువకుల 32 మంది బలిదానాలతో, వామపక్ష పార్టీల ఎంపీల రాజీనామాలతో సోవియట్ యూనియన్ సహకారంతో ఏర్పడిన విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ ఆలోచనను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతానన్న జగన్మోహన్‌రెడ్డి రోజు ఢిల్లీ కేంద్రం ముందు మోకరిల్లుతున్నారని విమర్శించారు. ఉక్కు రక్షణ కోసం పనిచేయడం లేదని ఆరోపించారు. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం, జనసేన పార్టీ సైతం విశాఖ ఉక్కు రక్షణ అత్యంత వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో ఉక్కు నిర్మాణం కోసం ఏ మాత్రం కషి చేయడం లేదని తెలిపారు. ఇలాగే వ్యవహరిస్తే రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలకు విద్యార్థులు, యువకులు, వారి కుటుంబ సభ్యులను చైతన్యం చేసి ఈ మూడు పార్టీలకు తగిన శాస్తి చెబుతామని హెచ్చరించారు. ఒక పల్లెటూరి నుంచి రాష్ట్రంలోనే అతిపెద్ద పారిశ్రామిక నగరంగా ఎదగడానికి విశాఖ ఉక్కు గాజువాక కు తోడ్పడిందని చెప్పారు. వేలాదిమందికి ఉపాధి కల్పిస్తుందని, అటువంటి ఉక్కు పరిశ్రమనే కడపలో నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. ఉక్కు రక్షణ కోసం, ఉక్కు సాధన కోసం, విద్యార్థి యువజన సంఘాల పోరాటం ఇది ఆరంభం మాత్రమేనన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలను ఉధతం చేస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు అన్ని పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి బంద్ నిర్వహించారు. అనంతరం ఎస్వీ ఇంజినీరింగ్ కాలేజీలో సెమినార్ నిర్వహించారు. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ నగర అధ్యక్ష, కార్యదర్శులు షాకీర్, ఓబులేష్, ఎస్‌ఎఫ్‌ఐ నగర కార్యదర్శి మనోజ్, ఎఎస్‌ఎఫ్ నగర్ కార్యదర్శి శివ, పిడిఎస్‌యు నగర నాయకులు విశ్వం, ఎఐవైఎఫ్ నాయకులు చైతన్య, ఆర్‌ఎస్‌వైఎఫ్ జిల్లా కార్యదర్శి నాగేంద్ర పాల్గొన్నారు. వైవీయూలో... : ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో వైవీయూ, వైయస్సార్ ఎఎఫ్‌యులో బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర యూనివర్సిటీ కో-కన్వీనర్ ఎం.ఆర్.నాయక్ మాట్లాడుతూ కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణం చేపట్టాలని గత దశబ్దంకు పైగా జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్న, ప్రభుత్వాలు మాత్రం శిలాఫలకాలకే పరిమితం అయ్యయన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మనోజ్, రాకేష్, మహేష్ పాల్గొన్నారు బద్వేలు :జిల్లా ఉక్కు కర్మాగారం సాధనకై విద్యార్థి యువజన సంఘాల రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పట్టణంలో డివైఎఫ్‌ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అన్ని విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉక్కు పరిశ్రమకు రెండుసార్లు శంకుస్థాపన చేసి శిలాఫలకం ఏర్పాటు చేశారే కానీ కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయలేదని తెలిపారు. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ బద్వేల్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఎస్కే మస్తాన్ షరీఫ్, గంగనపల్లి నాగార్జున, మహిళ కన్వీనర్ సి.గురుదేవి, ఉపాధ్యక్షులు ఆంజనేయులు, రోషన్, పట్టణ నాయకులు గురవయ్య, ఓబుల్‌రెడ్డి, యువరాజ్, సురేంద్ర, సురేష్, బాల గురవయ్య పాల్గొన్నారు. కాశినాయన : ఎస్‌ఎఫ్‌ఐ మండల అధ్యక్షులు సందీప్ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు అబ్దుల్, పండు, వంశీ, రమణ, దాసు పాల్గొన్నారు. జమ్మలమడుగు : అన్ని విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన విద్యాసంస్థల బంద్ జమ్మలమడుగు, మైలవరం, ముద్దనూరు మండలాల్లో విజయవంతమైందని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు వినరుకుమార్‌రెడ్డి తెలిపారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయన్నారు. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి తులసి, ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు రఘురాముడు, హుస్సేన్ మియా, గౌస్, ఇషాద్ అహ్మద,్ బాబ బాషా, సన్నీ, చరణ్ , పవన్, డివైఎఫ్‌ఐ పట్టణ నాయకులు గోపి, అంజి, నరసింహ, సూరి, రాఘవ, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు (పుట్టపర్తి సర్కిల్) : విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని పరిరక్షణ కోసం పట్టణంలో అన్ని విద్యాసంస్థలు బంద్ పాటించాయని డివైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రం డేవిడ్‌రాజ్ తెలిపారు. బంద్‌ను డివైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రం డేవిడ్‌రాజ్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు సునీల్, పిడిఎస్‌ఒ ఓబులేష్, ఆర్‌విఎస్ ప్రతాపరెడ్డి నిర్వహించారు. అభిలాష్, మోహన్‌బాబు, విష్ణు పాల్గొన్నారు. ముద్దనూరు : విశాఖ ఉక్కును ప్రయివేట్ సంస్థలకు అప్పగించిన బిజెపి ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన విద్యా సంస్థల బంద్ విజయవంతమైంది. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి నవీన్, నాయకులు గణేష్, గోపాల్, చంద్ర, శ్రీదర్, సుదర్శన్ పాల్గొన్నారు. చాపాడు : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, కడప ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన బంద్ విజయవంతమైందని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు రాహుల్, రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. బ్రహ్మంగారిమఠం : కడప ఉక్కు పరిశ్రమను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, విశాఖ ఉక్కును పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన విద్యాసంస్థల బంద్ ప్రశాంతంగా ముగిసింది. కార్యక్రమంలో కలివెల రాజశేఖర్, ఎర్రంపల్లి అజరు, కాశి, భరత్ పాల్గొన్నారు.