
ప్రజాశక్తి - టి.నరసాపురం
విద్యార్థుల్లో దాగి వున్న విద్యా సామర్థ్యాలపై పరిశీలనకు సీస్ సర్వే నిర్వహిస్తున్నట్లు విద్యా శాఖాధికారి టి.రామ్మూర్తి తెలిపారు. మండల విద్యాశాఖాధికారులు టి.రామ్మూర్తి, ఎస్.కళ్యాణిల పర్యవేక్షణలో సీస్ పరీక్ష శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో 3, 6, 9 తరగతులు చదివే విద్యార్థులకు 22 పాఠశాలల్లో 32 తరగతులకు 32 ఫీల్డ్ ఇన్విజిలేటర్ల సహాయంతో పరీక్ష నిర్వహంచినట్లు ఆయన తెలిపారు.