Aug 25,2023 21:45

విద్యా రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వాలుఎస్‌ఎఫ్‌ఐ స్కూటర్‌ యాత్ర ప్రారంభంలో నాయకులు

ఒంటిమిట్ట : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రాజేంద్రప్రసాద్‌ పేర్కొన్నారు. జిల్లాలో విద్యారంగ అభివద్ధి కోసం, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో చేపట్టనున్న 'విద్యార్థి సంగ్రామ స్కూటర్‌ యాత్ర' ను కోదండ రామాలయం సర్కిల్‌ నుంచి ప్రారంబి óంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఒంటిమిట్ట, సిద్ధవటం బద్వేల్‌, కాశినాయన పోరుమామిళ్ల, మైదుకూరు జమ్మలమడుగు, పులి వెందుల ప్రాంతాల్లో భారత విద్యార్థి ఫెడరేషన్‌ తరఫున విద్యార్థుల సమస్యలపై పోరాతున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చి విద్యారంగాన్ని పూర్తిగా నాశనం చేస్తోందని ఆవేనద వ్యక్తం చేశారు. జగనన్న విద్యా దీవెనకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఎక్కడలేని విధంగా జగన్‌ ప్రభుత్వం మెడి కల్‌ కళాశాలలో సీట్లు అమ్ముకునేలా జీవో నెంబర్‌ 107,108, తీసుకొని వచ్చిందని పేర్కొన్నారు. ఇంటర్‌లో చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభు త్వమే ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేయాలని తెలి పారు. మధ్యాహ్న భోజనం పథకం ఇంటర్‌ విద్యా ర్థులకు కూడా అమలు చేయాలన్నారు. అనం తరం హాస్టల్లో విద్యార్థులకు అందిస్తున్న భోజనం తనిఖీ చేశారు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గండి సునీల్‌ కుమార్‌, జిల్లా కమిటీ సభ్యులు, రాజశేఖర్‌రెడ్డి, సహాయ కార్యదర్శి, రవి, జిల్లా కమిటీ సభ్యులు అజయ. సిపిఎం జిల్లా వ్యసాయ కార్మిక ఉపా అధ్యక్షులు నరసయ్య పాల్గొన్నారు.