ప్రజాశక్తి కలక్టరేట్ (కృష్ణా) : కృష్ణాజిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యా రంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా రెవెన్యూ అధికారి పి. వెంకటరమణకు వినతిపత్రం అంద జేశారు. జిల్లావ్యాప్తంగా విద్యారంగంలో నెలకొన్న అనేక సమస్యల్ని అధికారులకు వివరించారు. నాడు నేడు పనులను త్వరగా పూర్తిచేసి సొంత భవనాల కేటాయిం చాలని . ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుపరచాలని ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ సొంతభవనాలు కేటాయించాలని పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు 3 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.అలాగే పెండింగ్లో ఉన్న కాస్మోటిక్ చార్జీలు వెంటనే విడుదల చేయాలన్నారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న అమ్మఒడి వసతి దీవిన, విద్యాధీన అందించాలన్నారు. వైద్య విద్య పేద బడుగు బలహీన వర్గాలకు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. వైద్య విద్య లో తీసుకొచ్చిన జీవో నెంబర్ 107, 108,లను రద్దు చేయాలని అదేవిధంగా జీవో నెంబర్ 77 రద్దుచేసి పీజీ విద్యార్థులకు ఫీజు రీయిమెంట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎస్ సమరం , జిల్లా ఉపాధ్యక్షులు వి.కీర్తి జిల్లా కమిటీ సభ్యుల సమీర్ పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.










