కడప అర్బన్ : జిల్లాలో విద్యారంగ అభివద్ధి కోసం, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 25 నుంచి 31 వరకు ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ''విద్యార్థి సంగ్రామ స్కూటర్ యాత్ర''ను జయప్రదం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సగిలి రాజేంద్రప్రసాద్ పిలుపునిచ్చారు. బుధవారం ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యాలయంలో ''విద్యార్థి సంగ్రామ స్కూటర్ యాత్ర'' కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో విద్యారంగ అభివద్ధి కోసం, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో ఉన్న 20 మండలాలలో దాదాపు 350 కిలోమీటర్ల పాటు స్కూటర్ యాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ యాత్ర ఈనెల 25న ఒంటిమిట్టలో ప్రారంభమై భాకరపేట, సిద్దవటం, అట్లూరు, బద్వేలు, పోరుమామిళ్ల, కలసపాడు, బి.మఠం, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, ముద్దనూరు, పులివెందుల, వేంపల్లి, వైవీయూ మీదుగా 31న కడపకు చేరుకుని యాత్ర ముగుస్తుందన్నారు. జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిస్కారం దిశగా ఈ యాత్ర కొనసాగుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాయన్నారు. పూటకొక జీవోలు తీసుకువస్తు విద్యరంగాన్ని విఛిన్నేం చేస్తున్నాయన్నారు. విద్యార్ధులకు విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు పేనడింగ్‌లో పెట్టి వేధిస్తుందన్నారు. సంక్షేమ హాస్టల్స్‌ని ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోవడమే మానేసిందన్నారు. సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు 7 నెలలుగా మెస్, కాస్మొటిక్ చార్జీలు విడుదల చేయకపోవడం దారుణమన్నారు. జిల్లాలో ప్రభుత్వ విద్యారంగం బలోపేతం కోసం విద్యారంగ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహించనున్న ''విద్యార్థి సంగ్రామ స్కూటర్ యాత్ర''ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఉదరు, మనోజ్, శేఖర్, చరణ్ పాల్గొన్నారు.










