Nov 03,2023 21:34

కెజిబివిలో భోజనాన్ని పరిశీలిస్తున్న డిఇఒ లింగేశ్వర రెడ్డి

ప్రజాశక్తి-వంగర :  పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారి బి.లింగేశ్వర రెడ్డి అన్నారు. వంగరలోని కెజిబివిని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. విద్యా ప్రమాణాలు, విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యతను పరిశీలించారు. కెజిబివిలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయుల కొరతను తక్షణమే పరిష్కరిస్తామన్నారు. విద్యార్థుల్లో కనీస విద్యాసామర్ధ్యాలను తెలుసుకునేందుకు జిల్లా వ్యాప్తంగా స్టేట్‌ ఎడ్యుకేషన్‌ అచీవ్‌మెంట్‌ -2023 పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు వంగర జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. అనంతరం స్థానిక ఎంఆర్‌సికి చేరుకున్న డిఇఒను పలువురు మహిళా సంఘాల ప్రతినిధులు కలిసి, కెజిబివి స్పెషల్‌ ఆఫీసర్‌ బి.రోహిణి పనితీరు సక్రమంగా లేదని, విద్యాలయానికి వచ్చిన వారితో దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ విధి నిర్వహణలో బాధ్యత లోపిస్తే సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయని ఎస్‌ఒను హెచ్చరించారు వారంలో రెండు రోజులు కెజిబివిని సందర్శించాలని ఎంఇఒ దుర్గారావును ఆదేశించారు అనంతరం అరసాడలో నాడు-నేడు పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఎపిఒ వంగపండు గోపీచంద్‌, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.