
ప్రజాశక్తి-అనకాపల్లి ప్రతినిధి
జిల్లాలో విద్యా దీవెన కింద 37,609 మంది లబ్ధి పొందినట్లు కలెక్టర్ రవి పట్టన్ శెట్టి తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జగనన్న విద్యా దీవెన నిధులు చిత్తూరు జిల్లా నగరిలో సోమవారం విడుదల చేశారు. వర్చువల్ విధానంలో జరిగిన కార్యక్రమంలో అనకాపల్లి గుండాల వద్దనున్న సచివాలయం-1 నుండి కలెక్టర్ రవి పట్టన్ శెట్టి హాజరయ్యారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జగనన్న విద్యా దీవెన కింద వెనుక బడిన తరగతులకు చెందిన 33,974 మందికి రూ.22. 35 కోట్లు, సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన 2,885 మందికి రూ.2.04 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖకు చెందిన 519 మందికి రూ.28.38 లక్షలు, ఈ.బి.సిలు 1,307 మందికి రూ.99.60 లక్షలు, కాపు సంక్షేమం కింద 2,823 మందికి రూ.1.79 కోట్లు, ముస్లిం మైనారిటీలు 187 మందికి రూ.13.63 లక్షలు, క్రిస్టియన్ మైనారిటీలు 44 మందికి రూ.3.35 లక్షలు వెరసి 37,609 మందికి రూ.24.85 కోట్లు జమ అవుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జెడ్పి వైస్ చైర్మన్ బి. వరాహ సత్యవతి, సాంఘిక సంక్షేమ, సాధికారిత అధికారి అజరు బాబు, జిల్లా బిసి సంక్షేమ, సాధికారిత అధికారి రాజేశ్వరి, జిల్లా గిరిజన సంక్షేమ సాధికారిత అధికారి నాగ శిరీష , విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.