Nov 19,2022 09:44

యుపిహెచ్‌సి శిలాఫలకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్‌, ఎమ్మెల్యే సుచరిత తదితరులు

ప్రజాశక్తి-గుంటూరు : విద్య, వైద్య రంగాలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని జిల్లా కల్లెకర్‌ ఎం. వేణుగోపాల్‌ రెడ్డి పేర్కొన్నారు. గుంటూరు అర్బన్‌ పరిధిలోని స్వర్ణాంధ్రనగర్‌, జన్మభూమి కాలనీలో నూతనంగా నిర్మించిన అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌సెంటర్‌ ప్రారంభోత్సవం, ఎస్సీ కమ్యూనిటి హాల్‌, సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణాలకు శంఖుస్థాపన కార్యక్రమాల్లో శుక్రవారం జిల్లా కలెక్టర్‌ ఎం. వేణుగోపాల్‌ రెడ్డి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, నగర మేయర్‌ కావటి శివనాగ మనోహర్‌నాయుడు, కమిషనర్‌ కీర్తి చేకూరితో కలిసి పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో 49 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో 32 కొత్తవి, 17 రినోవేషన్‌ పూర్తి చేసుకుంటున్నట్లు తెలిపారు. ఒక్కో అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ నిర్మాణానికి రూ. 80 లక్షలు కేటాయించిందని, మరో రూ.20 లక్షలతో అర్బన్‌ హెల్త్‌ సెంటర్లకు ఆధునిక పరికరాలు అందిస్తుందన్నారు. ఎమ్మెల్యే సుచరిత మాట్లాడుతూ రూ.30లక్షలతో కమ్యునిటీ హాల్‌ను, రూ.67 లక్షలతో సైడ్‌ డ్రైన్లు, సీసీ రోడ్లు నిర్మించు కోవడం కోసం శంఖుస్థాపనలు చేయడం జరిగిందన్నారు. మేయర్‌ మాటా ్లడు తూ గుంటూరు నగరంలో 16 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు ఏర్పాటు చేశామని అందులో 13 ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. కార్యక్రమంలో డిఎంఅండ్‌హెచ్‌ఒ డాక్టర్‌ సుమయాఖాన్‌, సిఎంఓ అండ్‌ హెచ్‌ డాక్టర్‌ విజయలక్ష్మీ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.