Jul 29,2022 23:53

పిహెచ్‌సిని ప్రారంభిస్తున్న మంత్రి రజని, ఎమ్మెల్యే ముత్తంశెట్టి

వైద్యఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజని, ఎమ్మెల్యే ముత్తంశెట్టి
ప్రజాశక్తి -పిఎం పాలెం.:
విద్య, వైద్యానికి వైసిపి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందనిరాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు శుక్రవారం రూ.కోటితో ఎండాడలో నిర్మించిన పిహెచ్‌సిని ప్రారంభించారు.ఈసందర్భంగా మంత్రి రజని మాట్లాడుతూ, కార్పొరేట్‌ స్థాయిలో ప్రభుత్వాసుపత్రుల్లో అన్ని సౌకర్యాలను, స్పెషలిస్ట్‌ వైద్యసేవలను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. అన్ని పిహెచ్‌సిల్లో వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా చేస్తామని, అదే సమయంలో వైద్యసేవల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు తప్పవన్నారు. ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ విలీన గ్రామం ఎండాడలో ఆసుపత్రి ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేశారు. సిఎం జగన్‌ విద్య, వైద్యానికి ప్రాధాన్యతనిస్తూ ఏనెలలో, ఏపథకాన్ని అమలు చేస్తున్నారో ముందుగానే చెప్పి, చేసి చూపిస్తున్నారన్నారు.కార్యక్రమంలో డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ విజయలక్ష్మి, సిఎంఒ శాస్త్రి, జెడ్‌సి బొడ్డేపల్లి రాము, హౌసింగ్‌ ఎఇ సూర్యప్రకాశ్‌, ముత్తంశెట్టి నందీష్‌, మహేష్‌, ఎండాడ డాక్టర్‌ నాని, కార్పొరేటర్‌ లోడగల అప్పారావు, నగర కార్పొరేషన్‌ చైర్మన్‌ పిల్లా సుజాతసత్యన్నారాయణ, పోతిన హనుమంతురావు 6,7 వార్డుల వైసిపి అధ్యక్షులు బొట్ట అప్పలరాజు, పోతిన శ్రీనివాస్‌, పిల్లా కృష్ణమూర్తిపాత్రుడు, పిల్లా సూరిబాబు, మొజ్జాడ రమణమూర్తి పాల్గొన్నారు.