Jul 04,2023 20:26

మాట్లాడుతున్న సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య

ప్రజాశక్తి - మంత్రాలయం
విద్య కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా పోరుసాగిద్దామని ఎఐఎస్‌ఎఫ్‌ జాతీయ కార్యదర్శి జి.రంగన్న కోరారు. మంగళవారం స్థానిక హెచ్‌ఆర్‌బి కల్యాణ మండపంలో ఎఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల విద్యా వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతులను జిల్లా అధ్యక్షులు సోమన్న అధ్యక్షతన నిర్వహించారు. వహించారు. ముఖ్య అతిథులుగా రంగన్న పాల్గొని పతాకావిష్కరణ చేశారు. రంగన్న, ఎఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్‌ బాబు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామచంద్రయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, ఎఐవైఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెనిన్‌ బాబు మాట్లాడారు. దేశంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం జాతీయ నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చి విద్యను పూర్తిగా కార్పొరేటీకరణ చేస్తోందని మండిపడ్డారు. పరిశ్రమలను బడాబాబులు అంబాని, అదానీలకు అప్పజెప్పే పద్ధతులను నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంభిస్తోందని తెలిపారు. డిగ్రీ విద్యా విధానాన్ని పాత పద్ధతుల్లోనే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ఎఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీరాములు, అనంతపురం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కుళ్లాయి స్వామి, చిరంజీవి, నంద్యాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసులు, ధనుంజయ, సత్యసాయి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చంద్రశేఖర్‌ రెడ్డి, రాజేంద్రప్రసాద్‌, కర్నూలు జిల్లా ఆఫీస్‌ బేరర్లు విజయేంద్ర, షాబీర్‌ బాష, రంగస్వామి, శరత్‌, థామస్‌ అల్తాఫ్‌ పాల్గొన్నారు.