Sep 16,2023 00:27

ప్రజశక్తి - చీరాల
స్థానిక ఎన్‌ఆర్ అండ్ పిఎం హైస్కూల్ గ్రౌండ్లో  జరిగిన అండర్ 14,17 బాల బాలికలు క్రీడల్లో మండలంలోని ఈపురుపాలెం శ్రీ విద్యాభారతి స్మార్ట్ స్కూల్ విద్యార్దులు ప్రతిభ చాటారు. జిల్లా స్థాయిలో అండర్ 17విభాగంలో జిల్లా స్థాయిలో జరుగనున్న వాలీబాల్‌ క్రీడల్లో ఆడేందుకు ఎన్ అమర్నాథ్, ఎస్‌కె సమీర్ వాలీబాల్ స్థానం దక్కించుకున్నారు. ఈ సందర్బంగా విద్యా భారతి స్మార్ట్ స్కూల్ డైరెక్టర్ ఎం వాసవి చంద్రిక, ప్రిన్సిపాల్ భరత్ ఎంపికైన విద్యార్థులతోపాటు వ్యాయామ ఉపాధ్యాయులు మధు బాబుని అభినందించారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ ఇంచార్జీలు జి పద్మావతి, జి శ్రీకాంత్, సురేంద్ర పాల్గొన్నారు.