రాయచోటి టౌన్ : సామాజిక మాధ్యమాలలో విద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు తప్పవని ఎస్‌పి బి.కృష్ణారావు అన్నారు. మంగళవారం పోలీస్ ప్రధాన కార్యాల యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ సామా జిక మాధ్యమలలో అసభ్యకరమైన దుర్భశాలడడం, అవమానకరమైన పోస్టులు చేస్తున్న పుల్లంపేట మండలం వత్తాలురుకు చెందిన చింతా సుదర్శన్ అనే నింది తుడిని అరెస్టు చేశామన్నారు. నిందితుడు సామాజిక మాధ్యమాల్లో అసభ్య కరమైన విద్వేషపూరిత పోస్టులు చేస్తు ఉండేవాడని నకిలీ మెయిల్ ఐడి ద్వారా చిత్రలహరి పేరుతో ఫేస్‌బుక్ పేజీని సృష్టించి అమాయకులను బ్లాక్ చేస్తుం డేవాడని పేర్కొన్నారు. బి.ఫార్మసి పట్టభద్రుడైన నిందితుడిని ఆరు నెలల కిందట ఉద్యోగం పేరుతో టిడిపి అనుచరుడితో పరిచయం చేసుకొని నెలకు రూ.8 వేలు జీతం పొందేవిధంగా టిడిపికి చెందిన వాట్సప్ గ్రూపులలో వచ్చే కఠోరమైన, అవమానకరమైన కంటెంట్‌లను 150 గ్రూపులలో పంచుకోవాలనే వారన్నారు. సుధా, సుదర్శన్, సుకన్య, అశ్మితారెడ్డి, మౌనికరెడ్డి, నికితారెడ్డి పేరిట నకీలి ప్రొఫైల్స్‌తో రాజకీయ నేతలపై అవమానకర సందేశాలు పోస్టు చేస్తుండేవాడని పేర్కొన్నారు. సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం నిబంధనలు ఉల్లంఘించిన నిందితుడిని అరెస్టు చేశామన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, పోస్టులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ఎవరు కూడా సామాజిక మాధ్యమాలలో పడి మోసపోకూడదని సూచించారు. సమావేశంలో రాజంపేట డిఎస్‌పి చైతన్య పాల్గొన్నారు.