Jul 27,2023 23:07

నమూనా చెక్కును అందజేస్తున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: పేదరికం కారణంగా చదువుకోలేని విద్యార్థులకు జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం బాసటగా నిలుస్తుందని కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ అన్నారు. విదేశీ విద్యా దీవెన పథకం నిధుల విడుదల కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానం ద్వారా గురువారం ప్రారంభించారు. కలెక్టరేట్‌ నుంచి కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, కళింగ వైశ్య కార్పొరేషన్‌ అధ్యక్షులు అంధవరపు సూరిబాబు, ఇన్‌ఛార్జి డిఆర్‌ఒ మురళీకృష్ణ, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి ఇ.అనురాధ, సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకులు విశ్వమోహన్‌ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పథకంలో భాగంగా జిల్లాలో ఐదుగురికి రూ.67.80 లక్షలు జమ చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం నమూనా చెక్కును అందజేశారు.