Apr 16,2023 16:33

ప్రచార బేరిని నిర్వహిస్తున్న సిపిఎం నాయకులు

విభజన హామీలు తక్షణమే అమలు చేయాలి: సిపిఎం
ప్రజాశక్తి పగిడ్యాల

     రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విభజన హామీలను తక్షణమే అమలు చేయాలని జిల్లా సిపిఎం కార్యదర్శి సభ్యులు ఎం నాగేశ్వరరావు, సిపిఎం నాయకులు భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, పకీర్ సాహెబ్   బిజెపి ప్రభుత్వంపై మండిపడ్డారు. మండలంలోని నెహ్రు నగర్ గ్రామంలో ఆదివారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రచార బేరి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కల్లబొల్లి మాటలతో రాష్ట్రాన్ని విడగొట్టి మేము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను కల్పించి విభజన హామీలను నెరవేస్తామని బిజెపి అప్పట్లో హామీ ఇచ్చి గెలిచి గద్దెనెక్కిన తర్వాత ప్రత్యేక హోదా గురించి విభజన హామీలను పూసే ఎత్తడం లేదని విమర్శించారు. నిరుద్యోగ సమస్యను నిత్యవసరవశుల ధరలను రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పి గెలిచిన తర్వాత బిజెపి ప్రభుత్వం పట్టీ పట్టనట్టు విహరించడం సరికాదన్నారు. బిజెపి మోడీ ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాల పాలనలో ఆంధ్రప్రదేశ్ కు తీరని ద్రోహం చేసిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు వచ్చిన తర్వాత నిత్యవసర వస్తువులను అదుపు చేయకుండా వ్యవసాయరంగాన్ని కార్పొరేటర్లకు అప్పచెప్పేందుకు ప్రయత్నించడ పై వారు మండి పడ్డారు. విద్యుత్ సంస్థలను ప్రైవేటు పరం చేసి రైతులు బోర్లకు మీటర్లు బిగించి రైతుల వెన్ను విరుస్తున్నారని విమర్శించారు. దేశంలో 15 లక్షల ఉద్యోగా పోస్టులు ఖాళీ ఉన్న వాటిని భర్తీ చేయకుండా నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తుందన్నారు. కర్ణాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్టును రూ 5300 కోట్లు మంజూరు రాయలసీమకు నీరు అందకుండా ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. హంద్రీనీవా ద్వారా , నాగటూరు ఎత్తిపోతల పథకం నుంచినందికొట్కూరు, మిడ్తూరు , పగిడ్యాల మండలాలకు సాగు తాగునీరు అందించాలని వారు డిమాండ్ చేశారు. నాగటూర్ ఎత్తిపోతల పథకం నుంచి పంట కాలువలు ఏర్పాటు చేసి రైతులకు సాగునీరు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు లక్ష్మన్న, ఈశ్వరమ్మ, వీరమ్మ, ముత్తునాయుడు , రామచంద్రుడు తదితరులు పాల్గొన్నారు.