ప్రజాశక్తి - కొయ్యలగూడెం
రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నిసార్లు పర్యటించినా రాష్ట్ర ప్రజలకు ఎటువంటి ఉపయోగమూ లేదని సిపిఐ మండల కార్యదర్శి జమ్మి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా సిపిఐ ఆధ్వర్యాన నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సిపిఐ పార్టీ పిలుపుమేరకు రాష్ట్ర విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. మోడీ విశాఖపట్నం పర్యటనకు వచ్చినప్పుడు విశాఖ ఉక్కును ప్రయివేటీకరించబోమని ప్రకటించకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఎస్ కె బాజీ, ఇళ్ల.నరసయ్య తదితరులు పాల్గొన్నారు.










