ప్రజాశక్తి-రావికమతం: విభిన్న ప్రతిభా వంతులు కూడా ఉన్నత చదువులు చదువుకోవాలని ముఖ్య మంత్రి జగన్మోహన్‌రెడ్డి సంకల్పించారని మేడివాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎమ్.జయలక్ష్మి తెలిపారు. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధానో పాధ్యాయురాలు జయలక్ష్మి మాట్లాడుతూ, విభిన్న ప్రతిభావంత విద్యార్థులకు కూడా అవకాశాలు కల్పిస్తే అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తారన్నారు.స్కూల్ అసిస్టెంట్, ప్రత్యేక ఉపాధ్యాయుడు మహాలక్ష్మి నాయుడు మాట్లాడుతూ, రావికమతం మండలంలో 8వ తరగతి చదువుతున్న ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు 17 మంది వివిధ పాఠశాలల్లో చదువుతున్నారని, వీరందరికీ ఉచితంగా ట్యాబులు అందించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అవసరాల పిల్లలకు అన్ని సంక్షేమ పథకాలు అందిస్తుందన్నారు. ప్రత్యేక అవసరాల పిల్లలకు 10వ తరగతి పరీక్షల్లో ప్రత్యేక సదుపాయాలతో పాటు పరీక్షల్లో మినహాయింపులు కూడా ఇచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










